పెళ్లి అన్నాక చుట్టాలు.. ఎన్నికలు అన్నాక సర్వేలు కామన్ గా వస్తూ ఉంటాయి. కానీ ఏపీ విషయంలో మాత్రం సర్వేలు కాస్తంత ముందుగానే వచ్చాయి. గత రెండేళ్లుగా సర్వేలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇలా వచ్చిన వాటిలో మెజార్టీ వైసీపీకి అనుకూలంగా ఉండగా.. మరొకొన్ని టీడీపీకి ఇప్పుడు కూటమికి అధికారాన్ని కట్టబెడుతున్నాయి. ఎవరికి అనుకూలంగా ఉంటే ఆయా పార్టీల వారు ప్రచారం చేసుకుంటున్నారు.


తాజాగా సీనియర్ జర్నలిస్ట్ పోతినేని రేణుక తన సర్వే ఫలితాలను వెల్లడించారు. వీటిని ఒక్కసారి పరిశీలిస్తే వైసీపీ 134 సీట్లు సాధించి రెండో సారి అధికారాన్ని చేపడుతుందని అంచనా వేసింది. ఈ సారి కూటమిగా వచ్చిన చంద్రబాబుకు మరోసారి నిరాశే ఎదురవుతుందని స్పష్టం చేసింది. చంద్రబాబు సారథ్యంలోని కూటమి 41 సీట్లకే పరిమతం అవుతుందని పేర్కొంది. ఓట్ల శాతం చూసుకుంటే వైసీపీకి 52శాతం ఓట్లు పోలవుతాయని.. ఇందులో మహిళలు 58శాతం ఉండగా.. పురుషుల్లో 42శాతం మంది ఓటేస్తారని అంచనా వేసింది.


మరోవైపు ఎన్డీయే కూటమికి 42శాతం ఓట్లు వస్తాయని ఇందులో మహిళా ఓట్లు 45శాతం.. పురుషుల ఓట్లు 55శాతం అని పేర్కొంది. ఇతరులకు మూడు శాతం ఓట్లు వస్తాయన్నట్లు వివరించింది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే … శ్రీకాకుళంలో ఎనిమిది సీట్లకు ఏడు వైసీపీ, ఒకటి టీడీపీ గెలుచుకుంటాయని అంచనా వేసింది. పార్వతీపురం-మన్యం 4 వైసీపీ, విజయనగరం- వైసీపీ 4, టీడీపీ 1, విశాఖపట్నం-వైసీపీ 4, టీడీపీ 3, అనకాపల్లి -వైసీపీ 4, టీడీపీకి 4 సీట్లు వస్తాయని పేర్కొంది.


కాకినాడ-వైసీపీ 5, టీడీపీ 2,తూర్పుగోదావరి-వైసీపీ 5, టీడీపీ 2, పశ్చిమగోదావరి-వైసీపీ 4, టీడీపీ 3, కోనసీమ-వైసీపీ 5, టీడీపీ 2, ఏలూరు-వైసీపీ 6, టీడీపీ 1, కృష్ణా-వైసీపీ5, టీడీపీ 2, ఎన్టీఆర్-వైసీపీ 4, టీడీపీ 3, పల్నాడు-వైసీపీ 6, టీడీపీ1, గుంటూరు-వైసీపీ 5, టీడీపీ 2, బాపట్ల-టీడీపీ 3, వైసీపీ 3, నెల్లూరు-వైసీపీ 7, టీడీపీ 2, ప్రకాశం వైసీపీ 7, టీడీపీ 1, కర్నూలు-వైసీపీ 8, నంద్యాల-6వైసీపీ, కడప-వైసీపీ 6, చిత్తూరు-వైసీపీ 5, టీడీపీ 2 సీట్లు గెలుస్తాయని అంచనా వేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: