- 2019లో పార్టీ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు చేతులెత్తేసి పార్టీ గెలిచాక బూచేప‌ల్లి హ‌డావిడి..?
- సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి సీటు లాక్కోవ‌డంతో ఓడిస్తామంటోన్న వైసీపీ కేడ‌ర్‌..
- క్లీన్ ఇమేజ్‌తో దూసుకుపోతోన్న గొట్టిపాటి ల‌క్ష్మి... వైసీపీ నుంచి కూడా ఫుల్ స‌పోర్ట్‌

( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతల్లోనే ఇప్పుడు ఇదే మాట వినిపిస్తుంది తెగించైనా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఓడించాలని.. అతడి అహంకారాన్ని అణ‌చాలని చర్చే నియోజకవర్గంలో బాగా వైరల్ అవుతుంది. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయలేను అని చేతులు ఎత్తేస్తేనే జగన్ ఎక్కడో బెంగళూరులో వ్యాపారాలు చేసుకునే బాదం మాధవరెడ్డిని పిలిచి దర్శి ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు. మాధవరెడ్డి కూడా చేతులు ఎత్తేయడంతో.. కాపు సామాజిక వర్గానికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాలను బతిమలాడి సీటు ఇచ్చారు జగన్.


మ‌ద్దిశెట్టి కష్టపడడంతో పాటు కాపు సామాజిక వర్గం ఓట్లు మళ్ళించుకోవడంతో పాటు.. ఇటు జగన్ ప్రభంజనం.. అన్నీ కలిసి ద‌ర్శిలోమద్దిశెట్టి ఏకంగా 40 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. అంతవరకు బాగానే ఉంది. తాను పోటీ చేయలేను.. ఓడిపోతానన్న భయంతో చేతులు ఎత్తేస్తేనే మద్దిశెట్టి ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పోటీ చేసి మరి దర్శి ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదేళ్లలో బూచేపల్లితో పాటు ఆయన కుటుంబం మద్దిశెట్టితో పాటు.. నియోజకవర్గంలో ఉన్న ఇతర సామాజిక వర్గాల వారిని.. ఎన్ని ఇబ్బందులకు గురిచేసిందో దర్శి ఓటర్లలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.


గత ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడి చేతులు ఎత్తేసిన మనిషి.. గెలిచిన వ్యక్తిపై ఆధిపత్యం చెలాయించటం అంటే ఎంత కామెడీగా ఉందో అన్న చర్చలు ఇప్పుడు దర్శిలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తల్లి బూచేపల్లి వెంకాయమ్మకు.. జడ్పీ చైర్ పర్సన్ పదవి వచ్చాక కాస్త ధైర్యం తెచ్చుకుని పోటీలో ఉన్నారే కానీ.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శివప్రసాద్ రెడ్డి ఏమైపోయాడు అన్న విమర్శలు కూడా సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. నియోజకవర్గం లో మిగిలిన సామాజిక వర్గాలను బూచేపల్లి కుటుంబం దారుణంగా అవమానించడంతోపాటు.. అణ‌గ‌దొక్కిందన్న విమర్శలు కూడా ఉన్నాయి.


దీనికి తోడు మద్దిశెట్టి కూడా ఐదేళ్లపాటు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్న.. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కి సపోర్ట్ చేసేందుకు దాదాపు నిర్ణయించుకున్నారు. ఇక వైసీపీ వాళ్లు కూడా చాలా మంది క్లీన్ ఇమేజ్‌తో ఫ‌స్ట్ టైం ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోన్న ల‌క్ష్మిని గెలిపిద్దామ‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఇక ఐదేళ్లపాటు బూచేపల్లి చేతిలో ఎన్నో అవమానాలకు గురైన వైసీపీలోని మెజార్టీ కేడర్ కూడా ఈసారికి తెగించైనా శివప్రసాద్ రెడ్డిని ఓడించి.. తమకు ఎదురైన అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవాలని కసితో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎలాగైనా ఎమ్మెల్యేగా ఉన్న మద్ది శెట్టికి కోపరేట్ చేయకుండా ఆయన రాజకీయంగా అణ‌గదొక్కారో... ఇప్పుడు శివప్రసాద్ రెడ్డిని ఓడించి కూడా ఆయన్ను కూడా రాజకీయంగా అణ‌గదొక్కితేనే మా కసి నెరవేరుతుందని నియోజకవర్గం వైసీపీలో చర్చించుకుంటున్న పరిస్థితి దర్శిలో కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: