- మంగ‌ళ‌గిరిలో లోకేష్‌ను మించి క‌దిరిలో కందికుంట‌కు ట‌ఫ్ ఈక్వేష‌న్‌
- 25 ఏళ్లుగా ప్ర‌జాసేవ‌కే అంకిత‌మైన భార్య‌భ‌ర్త‌లు
- మూడుసార్లు ఓడినా చంద్ర‌బాబుకు న‌మ్మ‌కానికి కార‌ణం ఇదే..!


( రాయ‌ల‌సీమ - అమ‌రావ‌తి )
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు.. ఒకే ఒక్కడు చాలా కష్టమైన క్లిష్టమైన ఈక్వేషన్ లో ఉన్న నియోజకవర్గంలో గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా 20 ఏళ్లకు పైగా పార్టీని ఒంటి చేత్తో నడిపించుకుంటూ వస్తున్నారు. అదేదో అగ్రకులాలకు చెందిన వ్యక్తి కాదు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఓ సాధారణ నాయకుడు. పార్టీకి అత్యంత సంక్లిష్ట‌మైన నియోజకవర్గంలో రెండు దశాబ్దాలకు పైగా ఒంటి చేత్తో పార్టీని నడిపించడం అంటే మామూలు విషయం కాదు. ఆ నేతకు తోడు ఆ నేత భార్య కూడా ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను ఉన్నానంటూ భర్తకు వెన్నంటే ఉంటుంది. అలాంటి చోట గెలిచిన, ఓడినా కూడా చంద్రబాబు ఆ నేతని నమ్ముకుని వరుసగా టిక్కెట్ ఇస్తున్నారంటే.. ఆ నేతపట్ల పార్టీ అధిష్టానానికి, చంద్రబాబుకు, లోకేష్‌కు ఏ స్థాయి నమ్మకం ఉందో తెలుసుకోవచ్చు.


కందికుంట‌ది 40 వేల ఓట్ల ప‌ర్స‌న‌ల్ క్రేజ్‌..
ఆ నేత ఎవరో కాదు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే.. ప్రముఖ టీడీపీ నేత కందికుంట వెంకటప్రసాద్. కందికుంట వెంకటప్రసాద్ బీసీలలో చేనేత సామాజిక వర్గంలోని ఉపకులాలకు చెందినవారు. తెలుగుదేశం పార్టీ అన్నా.. ఎన్టీఆర్, చంద్రబాబు, పరిటాల రవి అన్నా ఎంతో పిచ్చి. ఈ క్రమంలోనే 2004 ఎన్నికలకు ముందే కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టి.. 2004 ఎన్నికల టైంకు అప్పట్లో పార్టీ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకంగా వేవ్ ఉన్నా కూడా కాంగ్రెస్ నేతగా రాష్ట్రంలో ఎంతో ప్రభావం చూపిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల నియోజకవర్గాన్ని.. ఆనుకుని ఉన్న కదిరిలో టీడీపీ గెలుస్తుంది అనే స్థాయికి పార్టీని పటిష్టం చేశాడు కందికుంట వెంకటప్రసాద్.


2004 ఎన్నికలలో ఇండిపెండెంట్గా పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ ప్రభంజనంలో కేవలం ఎనిమిది వేల ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. ఆ ఎన్నికలలో కందికుంటకు ఏకంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కందికుంట వెంకటప్రసాద్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఓ సాధార‌ణ వ్య‌క్తికి ఇంత స్టామినా ఉందా ? అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదేళ్లపాటు కందికుంట ప్రతిరోజు అలుపెరగని పోరాటం చేశారు. అందుకే 2009 ఎన్నికలలో ఇటు కాంగ్రెస్, అటు ప్రజారాజ్యం హవాను కూడా తట్టుకొని కందికుంట 16 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి.. ఆ ఎన్నికలలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని భారీ మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డుల్లో నిలిచారు. ఆ తర్వాత రెండు ఎన్నికల్లోను కందికుంట ఓడిపోయినా చంద్రబాబుకు కందికుంటపై నమ్మకం ఏమాత్రం చెక్కుచెదరలేదు.


లోకేష్‌కు మంగ‌ళ‌గిరి.. కందికుంట‌కు క‌దిరి ఒక్క‌టే...
పార్టీ అధికారంలోకి వచ్చిన 2014 ఎన్నికలలో కందికుంట కేవలం 700 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. కదిరి లాంటి క్లిష్టమైన నియోజకవర్గంలో మరొక నేత టీడీపీ నుంచి రాజకీయం చేయాలంటే ఎప్పుడో వదిలిపెట్టి వెళ్లిపోయేవారు. కానీ పోరాట పటిమ‌కు మారుపేరు ఆయన కందికుంట ఏమాత్రం వెనుకడుగు వేయకుండా 20 సంవత్సరాలకు పైగా పార్టీని ముందుకు నడిపిస్తూ.. క్యాడర్‌లో జోష్ నింపుతూ మా ప్రసాద్ అన్న అనేంత‌గా ఆప్యాయత నియోజకవర్గ కేడర్‌లో సొంతం చేసుకున్నారు. మంగళగిరి లోకేష్ కు ఎంత సంక్లిష్టమైన నియోజకవర్గమో... కదిరి కూడా టీడీపీకి అంతే సంక్లిష్టమైన నియోజకవర్గం. మంగళగిరిలో టీడీపీ ఎప్పుడో 1994లో మాత్రమే గెలిచింది. పార్టీ గెలిచి 30 ఏళ్ళు అయింది. పైగా లోకేష్.. చంద్రబాబు తనయుడు, మంత్రి. ఇటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి కూడా గత ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా ఇప్పుడు పట్టు వదలైన విక్రమార్కుడిలా మళ్ళీ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు.


అరేయ్ కందికుంట మ‌న‌కోసం చాలా చేశాడు.. మ‌నం ఈ సారి గెలిపిద్దాం...
సామాజిక సమీకరణలపరంగా టీడీపీకి అంతా అనుకూలమైన నియోజకవర్గం మంగళగిరి కాదు. కానీ పోగొట్టుకున్నచోట వెతుక్కోవాలన్న కసితో లోకేష్ అక్కడ ప్రజలకు సేవ చేసి.. మళ్లీ ప్రజల ఎన్నికల్లో మెప్పు పొందేందుకు రెడీ అవుతున్నారు. నిజానికి కదిరి కూడా అంతే సంక్లిష్టమైన నియోజకవర్గం. కదిరి పట్టణంలో మైనార్టీ ఓటింగ్ 70 వేల వరకు ఉంది. నియోజకవర్గంలో రెడ్లు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ఓటింగ్ కూడా చాలా ఎక్కువ. సామాజిక సమీకరణలపరంగా కూడా టీడీపీకి కదిరి అంతా అనుకూలం కాదు. అలాంటి చోట ఎమ్మెల్యేగా గెల‌వ‌డం.. కేవ‌లం వంద‌ల తేడాతో ఓడిపోవ‌డం అంటే కందికుంటకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో తెలుస్తోంది. ఇక ఈ ఎన్నిక‌ల్లో క‌దిరి జ‌నాల నుంచి ఒక్క‌టే మాట వినిపిస్తోంది. మైనార్టీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల‌తో పాటు వైసీపీ వీరాభిమానులు కూడా అరేయ్ క‌దిరి కోసం కందికుంట ప్ర‌సాద్ ఎంతో చేశాడు.. మ‌నం ఆయ‌న‌కేం చేయ‌లేక‌పోయామ్‌.. ఈసారి కందికుంట‌ను గెలిపించుకుని మ‌నం రుణం తీర్చుకుందాం.. క‌దిరిని అభివృద్ధి చేసుకుందాం అనే మాటే ఎక్కువుగా వినిపిస్తోంది. మ‌రి కందికుంట రెండోసారి అసెంబ్లీలోకి ఎంట్రీ ఎలా ఇస్తాడు ? అనేదే ఇప్పుడు స‌స్పెన్స్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: