ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పై విజయవాడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న సమయంలో రాళ్ల దాడి చేసిన సంగతి తెలిసిందే.. దీంతో శనివారం రోజు నుంచి నిందితుల కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు.ముఖ్యంగా నిందితను పట్టుకునేందుకు కోసం ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు కూడా చేసింది.. ఈ విషయం పైన వైసిపి నేతలు కూడా ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది.. ముఖ్యంగా చంద్రబాబు కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని పలువురు వైసిపి నేతలు ఫిర్యాదు చేశారు.


శనివారం రోజున సీఎం స్థాయి వ్యక్తి పైన దాడి జరగడంతో ఈ విషయాన్ని పోలీసులు సీరియస్గా తీసుకొని విచారణ చేపట్టారు.. వీరికి అజిత్ సింగ్ నగర్ లో మూడు సెల్ఫోన్ టవర్స్ డేటాను కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ సరౌండింగ్లో 20 వేల మొబైల్స్ కూడా యాక్టివ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అవసరం ఉండి ఇంట్లో ఉండి ఒక రౌడీ మూక ఎయిర్ గన్నుతో షూట్ చేసినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే జగన్ ప్రచారానికి సంబంధించి భద్రత విషయంలో కూడా అధికారులకు పలు సూచనలు కూడా చేశారు.


ప్రస్తుతం ఈ విచారణ మరింత వేగవంతంగా చేస్తూ  పోలీసులు ఎవరు చేశారని విషయం పైన ఆరా తీస్తున్నారు.. ఇప్పుడు తాజాగా నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమానం ఇస్తామంటూ పోలీస్ కమిషనర్ పత్రికా ప్రకటన ద్వారా ఒక లేఖను విడుదల చేశారు.. ముఖ్యంగా సెల్ ఫోన్ లో వీడియో రికార్డింగ్లో ఈ సన్నివేశాలను బంధించిన వారు ఎవరైనా ఉంటే నేరుగా తమకు తెచ్చి ఇస్తే 2 లక్షల రూపాయలు బహుమతి ఇస్తామంటూ కూడా వెల్లడించారు. అయితే అలా ఇచ్చిన వారి విషయాలను కూడా చాలా రహస్యంగానే  ఉంచుతామంటూ హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇలా అయినా సరే నిందితులు ఎవరనే విషయం బయటపడుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: