ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే మేమంతా సిద్ధం అనే పేరుతో బస్సు యాత్రను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఈ యాత్రకు జనాల నుండి విశేష స్పందన లభిస్తుంది. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా జనాలు తండోపతండాలుగా జగన్ యాత్రకు వస్తున్నారు. అలాగే ఆయనకు పూలతో, అరుపులతో స్వాగతాలు చెబుతున్నారు. ఇంతటి క్రేజ్ తో అద్భుతమైన జోష్ లో ముందుకు సాగుతున్న ఈ యాత్రకు చిన్న బ్రేక్ పడింది.

అంతా సజావుగా సాగుతున్న వేళ జగన్ పై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేయడం వల్ల ఆయనకు చిన్నపాటి గాయాలు అయ్యాయి. దానితో వైసీపీ పార్టీ నేతలు , కార్యకర్తలు , ప్రజలు ఎంతో ఆందోళన పడ్డారు. కానీ జగన్ ఒక రోజు మాత్రమే రెస్ట్ తీసుకొని మళ్ళీ యాత్రకు బయలు దేరబోతున్నాడు. అందులో భాగంగా ఈ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నారాయణపురం నుంచి ఈతకోట వరకూ సాగనుంది.

ఉదయం 9 గంటలకు నారాయణపురం నుండి జగన్ బయలుదేరుతారు. నిడమర్రు , గణపవరం మీదుగా ఉండి చేరుకొని ఉండి శివారులో భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ దగ్గర సాయంత్రం 3 గంటల 30 నిమ శలకి బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర , పెరవలి , సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారుకి చేరుకొని.. రాత్రికి అక్కడ ఉండనున్నారు.

ఇక ఈ రోజు జగన్ బస్సు యాత్రపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమంతటా ఉత్కంఠ నెలకొంది. ఎందుకు అంటే..? రాళ్లదాడు జరిగిన తరువాత జగన్ ప్రజల్లోకి రావడం ఇదే మొదటి సారి. దానితో జగన్ ఈ రోజు ఏమి ప్రసంగిస్తాడు..? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతాడు..? అనే దానిపై ఆంధ్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇవాల్టి ప్రసంగంలో జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: