•పెద్ది రెడ్డి ప్రత్యర్ధులే అండ..

•కిరణ్ కుమార్ రెడ్డి సాహసం చేస్తున్నారా

•మిథున్ రెడ్డికి అండగా పెద్దిరెడ్డి


రాజంపేట (ఇండియా హెరాల్డ్)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్కీ ఛాన్స్ కొట్టిన సీఎం ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత స్పీకర్గా మారి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో సీఎం పీఠంపై రోశయ్య కూర్చున్నారు కానీ ఉమ్మడి ఎంపీ లో సామాజిక సమీకరణలు చూసి కాంగ్రెస్ హై కమాండ్ kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గా అవకాశం ఇచ్చింది. అంతేకాదు ఉమ్మడి ఏపీలో చివరి సీఎం కూడా ఈయనే. అయితే రాష్ట్ర విభజన వైసిపి పార్టీ ఆవిర్భావంతో కాంగ్రెస్ పార్టీ కాస్త ప్రమాదంలో పడింది. దీంతో కిరణ్ రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్ధకంగా మారగా.. ఆయన ఎటు వెళ్ళాలో తెలియక చివరికి బిజెపి గూటికి చేరుకున్నారు.. ఇక ప్రస్తుతం రాజంపేట ఎంపీగా kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి తరఫున పోటీ చేస్తూ ఉండగా.. వైసిపి సిట్టింగ్ ఎంపీ మిధున్ రెడ్డి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి పది సంవత్సరాలుగా రాజకీయ రంగానికి తెరమరుగైన కిరణ్ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అంటూ రంగంలోకి దిగారు అయితే చిరకాల ప్రత్యర్థిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఇప్పుడు అక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తుండడంతో ఎలాగైనా సరే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు..

 నిజానికి రాజంపేటలో బిజెపికి బలం అంతంత మాత్రమే. అక్కడ టిడిపి పైనే ఆధార పడాల్సిన అవసరం ఉంటుంది.అటు తెలుగుదేశం పార్టీ కూడా 25 సంవత్సరాల క్రితమే గెలిచింది.. ఆ తర్వాత మళ్లీ గెలుపుకు నోచుకోలేదు ఇటు వైసిపి ఆవిర్భావం నుంచి రాజంపేట నియోజకవర్గం వైసీపీ పార్టీకి కంచుకోటగా మారింది 2014లో కూటమి స్ట్రాంగ్ వేవ్ లో ఉన్నప్పుడు రాజంపేట...కూటమి అభ్యర్థిగా పురందేశ్వరి పోటీ చేశారు కానీ ఆమె పై మిథున్ రెడ్డి 1,74 వేల ఓట్లతో గెలుపొందడం ఒక సంచలనం అని చెప్పాలి. ఇక 2019 ఎన్నికల్లో కూడా వైసిపికి 2 లక్షల 68 వేలఓట్ల మెజారిటీ లభించింది . ఇక అలా వైసీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం అందులోనూ ప్రజల ఆదరాభిమానాలు పొందిన మిధున్ రెడ్డి పై 10 సంవత్సరాలుగా రాజకీయ రంగానికి దూరమైన కిరణ్ రెడ్డి పోటీ చేస్తుండడం అనేది ఒక సాహసం అనే చెప్పాలి.ఇక అంతేకాదు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు వైసిపి చేతిలోనే ఉన్నాయి. ఇక అక్కడ పార్లమెంటు స్థానానికి కూడా భారీ ఆధిక్యత ఉంది.. అన్ని సీట్లు వైసీపీకి మద్దతుగా ఉన్నాయి.

పైగా పూర్వం తనతో పాటు పనిచేసిన కాంగ్రెస్ నేతలు వైసిపి లోకి వెళ్లిపోయారు .ఇక వారి సహకారాన్ని కిరణ్ ఇప్పుడు అడుగుతున్నట్లు తెలుస్తోంది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కిరణ్ గెలవకూడదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారు. మరోవైపు కిరణ్ గెలిచి కేంద్ర మంత్రి కావాలని అనుకుంటున్నారు..ఇక్కడ కిరణ్ కి కలిసి వచ్చే అంశాల విషయానికి వస్తే.. కిరణ్ హయాంలో రాజంపేట పార్లమెంటు స్థానానికి పెద్ద ఎత్తున నిధులు సమకూరాయి. కాంగ్రెస్ నేతలకు అప్పట్లో స్వేచ్ఛ ఇచ్చారు.. కాబట్టి కిరణ్ కి అక్కడ మంచి పేరు ఉంది అందుకే పెద్దిరెడ్డి వ్యతిరేకులు అంతా ఏకమయి కిరణ్ ను గెలిపించాలని చూస్తున్నారు.  ప్రస్తుతం రాజంపేట పార్లమెంటు స్థానం వైసిపికి మంచి బలం ఉన్న సీటు అక్కడ గనుక కిరణ్ రెడ్డి గెలిస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి .అయితే ఇంకొక వైపు మిథున్ రెడ్డి కూడా తన స్థానాన్ని మళ్లీ తానే దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి గట్టి పోటీ సాహసాల మధ్య అటు మిథున్ రెడ్డి ఇటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలలో గెలిచేది ఎవరో అనేది ఉత్కంఠ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: