ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి  జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకుంటు ప్రతిపక్ష పార్టీ నాయకులను విమర్శిస్తూ వస్తున్నారు.. కానీ జగన్ ఇప్పుడు కుటుంబపోరుతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఇప్పటికే ఏపీసీసీ ఛైర్మన్ మరియు సొంత చెల్లెలు అయిన షర్మిల అన్న జగన్ ను తీవ్రంగా విమర్శిస్తుంది.. ఇప్పుడు కొత్తగా బాబాయ్ కూతురు సునీత కూడా ఆమెకు తోడవుతోంది. దాంతో ఇద్దరు చెల్లెళ్ళతో వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఇబ్బందులు ఎదురు కానున్నాయి.ప్రస్తుతం జగన్ కు ప్రతిపక్ష పార్టీ నాయకుల కంటే చెల్లెళ్ళ పోరు ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల అన్న జగన్ పై విమర్శల బాణాలు వదులుతున్నారు. దాంతో జగన్ కూడా  వైసీపీ నేతలు, వైఎస్ కుటుంబానికి దగ్గర అయిన వ్యక్తులతో షర్మిలను తిట్టించడం స్టార్ట్ చేశారు.

షర్మిల పోరుతోనే ఏం చేయాలో అర్థం కానీ జగన్  కు ఇప్పుడు మరో చెల్లెలు తోడైంది. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతా రెడ్డి కూడా షర్మిలతో జత కట్టారు.తన తండ్రి వివేకా హత్య కేసులో న్యాయపోరాటం చేస్తున్న ఆమె జగన్ ను టార్గెట్ చేశారు. కడప పార్లమెంట్ సీటు నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు.దాంతో అవినాష్ కు వ్యతిరేకంగా షర్మిల బరిలోకి దిగింది.ఓ నేరస్థుడికి జగన్ మరోసారి ఎంపీ అభ్యర్థి గా అవకాశం ఇచ్చారని ఆమె మండిపడింది. సునీత కూడా జగన్ చేసిన అన్యాయం పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది.. జగన్ కు ఓటేయొద్దని కుటుంబంనే పట్టించుకోని జగన్ జనాలను ఏం ఉద్దరిస్తారు అని సునీత హేళన చేసింది. దీనితో రానున్న రోజులలో జగన్ కు చెల్లెళ్ల బెడద మరింత ఎక్కువయ్యే అవకాశం వుంది…

మరింత సమాచారం తెలుసుకోండి: