ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు జరగబోతున్న వేళ ఇప్పటికే పలు రకాల సర్వేలు సైతం ఏ పార్టీ వస్తుందని విషయం పైన తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా సినీ హీరో విశాల్ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తాజాగా ఒక ప్రముఖ ఛానల్  తో మాట్లాడిన హీరో విశాల్ ఆంధ్రలో మళ్లీ సీఎం అయ్యేది వైయస్ జగన్ అంటూ తెలియజేశారు.. అలాగే జగన్ పైన జరిగిన దాడి కుట్రలో కోనంగా మాట్లాడడం కూడా జరిగింది.. కావాలని జగన్ పైన ఇలాంటి దాడి చేశారని గతంలో కూడా ఆయన పైన కోడి కత్తితో దాడి చేశారనే  విశాల్ వెల్లడించారు.


ఇలాంటి దాడులకు అసలు జగన్ భయపడరని కూడా వెల్లడించారు. అయితే తాను వైసిపి పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లుగా ఎప్పుడూ తెలియజేయలేదని కేవలం జగన్ గారు అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందంటూ వెల్లడించారు విశాల్.. ముఖ్యంగా జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత నాటి నుంచి ఇప్పటివరకు సీఎం జగన్ ఎదిగిన తీరు అందరిని ఆకట్టుకుంటుందంటూ తెలిపారు. ప్రజలు ఒక వ్యక్తిని నమ్మి సీఎం చేశారని విషయం మామూలు విషయం కాదని కూడా విశాల్ వెల్లడించారు. రాబోయే ఎన్నికలలో కూడా తప్పకుండా సీఎం జగన్ గారి గెలుస్తారని తన అభిప్రాయంగా తెలియజేశారు.


గతంలో కూడా చంద్రబాబు సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంలో కూడా వైసిపి పార్టీ నుంచి విశాల్ పోటీ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలన్నిటిని కూడా విశాల్ ఖండించడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు తానేమి వైసీపీకి మద్దతు ఇవ్వడంలేదని కేవలం జగన్ కు మాత్రమే ఫ్యాన్ అంటూ తన అభిమానాన్ని మరొకసారి చాటుకున్నారు హీరో విశాల్.. ఇటీవలె తాను నటించిన రత్నం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశాల్ ఇలా మాట్లాడారు.. విశాల్ కూడా త్వరలోనే తమిళనాడులో రాజకీయ పార్టీని కూడా స్థాపించబోతున్నట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: