ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రోజురోజుకీ చాలా తీవ్రస్థాయికి ముదిరిపోతున్నాయి.. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజుల నుంచి రాళ్లదాడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోని హాట్ టాపిక్ గా మారుతోంది. గత శనివారం రోజున సీఎం జగన్ పైన గుర్తు తెలియని వ్యక్తి రాళ్ల దాడి చేయడం జరిగింది.. అయితే ఆ మరుసటి రోజున అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు పైన గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు దాడి చేశారు. దీంతో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య పలు రకాల నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. సీఎం జగన్ పైన జరిగిన రాళ్లదాడి విషయంలో  పోలీసులు సైతం ఆ దాడి వెనుక ఉన్న వ్యక్తిని ఇటీవల గుర్తించారు.ఇదంతా సర్దుమరుగుతున్న సమయంలో ఇప్పుడు తాజాగా మళ్లీ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన మరో దాడికి కుట్ర జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కృష్ణాజిల్లా లోని గుడివాడలో జరిగిన సిద్దం సభలో భాగంగా మరో దాడికి కుట్ర జరిగినట్లుగా అక్కడ వైసిపి కార్యకర్తలు నేతలు కూడా అనుమానాన్ని తెలియజేస్తున్నారు. మద్యం తాగి సభా ప్రాంగణంలో ఒక యువకుడు ప్రవేశించేందుకు పలు రకాలుగా ప్రయత్నించడంతో ఈ విషయాన్ని అక్కడ పోలీసులు గుర్తించడంతో వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.


ఈ తరుణంలోనే సీఎం జగన్ పైన మరొక కుట్ర చేసే విధంగా ఎవరో ప్లాన్ చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే పోలీసులు అలర్ట్ కావడం వల్ల ఈ కుట్ర భగ్నమైందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సైతం ఆ యువకుడిని విచారిస్తూ దాడి చేసేందుకు రాయితో వచ్చారా.. లేకపోతే తన వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే కోణంలో విచారణ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొన్న విజయవాడలో జరిగిన బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగింది. దీంతో జగన్ కంటి పైన చాలా బలంగా గాయం కూడా అయ్యింది.. నిందితుని కూడా పోలీసులు పట్టుకొని అరెస్టు చేయడం జరిగింది. విచారణ మాత్రం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: