ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ నుండి తోట త్రిమూర్తులు మండపేట నియోజకవర్గం నుండి బరిలో దిగనున్నారు. ఇక ఎలక్షన్లకు ఇంకా నెల కూడా లేదు. ఇప్పటికే ఈయన ఈ ప్రాంతంలో ప్రచారాలను కూడా జోరుగా చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఒక పాత కేసు బయటకు వచ్చింది. అందులో భాగంగా నిందితులోగా ఉన్న త్రిమూర్తులకు కూడా జైలు శిక్ష పడింది. అసలు ఆ కేసు ఏంటి..? ఎంత కాలం జైలు శిక్ష పడింది. దానివల్ల త్రిమూర్తులకు ఎలాంటి నష్టం జరగనుంది అనే విషయాలను తెలుసుకుందాం.

1996 వ సంవత్సరం డిసెంబరు 29 న ప్రస్తుత కోనసీమ జిల్లా, అప్పటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. ఇందులో అప్పటి టీడీపీ నాయకుడు, ఇప్పటి వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులుగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాలపాటు కోర్టులో నలిగిన ఈ కేసు కు నిన్న తీర్పు వచ్చింది. ఆ తీర్పులో విశాఖ పట్టణం కోర్టు 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50లక్షల జరిమానా విధించింది.

అలా చాలా సంవత్సరాల క్రితం జరిగిన పరిణామాలకు సంబంధించిన కోర్టు తీర్పు నిన్న రావడంతో ఇది త్రిమూర్తులకు ఎంతో పెద్ద మైనస్ గా మారే అవకాశాలు ఉన్నాయి. శిరోముండనం కేసు మినహా తోట త్రిమూర్తులు రాజకీయ జీవితంలో పెద్దగా వివాదాలు ఎమి లేవు. త్రిమూర్తులు 1982 వ సంవత్సరంలో సీనియర్ ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన కొత్తలోనే టీడీపీ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో భాగంగా ఈయన రామచంద్రపురం నియోజకవర్గం లో స్ట్రాంగ్ లీడర్ గా మారారు. 1994 సంవత్సరం ఈయన మొదటిసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు.

ఆ తర్వాత టీడీపీ లోకి జాయిన్ అయ్యారు. 1999 వ సంవత్సరం ఈయన రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004వ సంవత్సరం ఓడిపోయిన ఈయన 2008వ సంవత్సరం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల్లో పోరాడిన ఈయన అందులో ఓడిపోయారు. 2014 వ సంవత్సరం ఆ ప్రాంత ఎమ్మెల్యే సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయడంతో మళ్లీ పోటీలోకి దిగిన ఆయన మళ్లీ గెలుపొందారు.

2014లో టీడీపీ తరఫున పోటీ చేసి మళ్లీ గెలిచారు. 2019లో టీడీపీ తరఫునుండి పోటీ చేసి ఓడిపోయిన త్రిమూర్తులు ఆ తర్వాత వైసీపీ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక మరి కొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఈయన మండపేట నుండి బరిలో దిగబోతున్నారు. ఇదంతా బాగానే ఉంది. ఈ ప్రాంతంలో ఇతనే గెలుస్తాడు అని సమీకరణాలు బలంగా ఉన్న సమయంలో కోర్టు తీర్పు రావడం అందులో ఈయనకు జైలు శిక్ష వేధించడం త్రిమూర్తులు కి చాలా నెగిటివ్ గ మారిపోయింది. మరి కోర్టు శిక్ష విధించడంతో జగన్ ఈ సీటును వేరే ఎవరికైనా ఇస్తారా..? లేక త్రిమూర్తులతోనే కంటిన్యూ అవుతారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: