జగన్ ఉచ్చులో చంద్రబాబు..
•వ్యతిరేకతను వాడుకోవడంలో విఫలం..
• గెలుపు తీరాల్లో ఉన్నా అనుమానమే..


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఓవైపు టీడీపీ కూటమి మరోవైపు వైసీపీ హోరా హోరీగా తలపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అనే విధంగా హోరెత్తిస్తున్నారు. అలాంటి ఏపీలో చంద్రబాబు 40+ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూనే తన ప్రత్యర్థి జగన్ ఉచ్చులో పడిపోతున్నారు. ఈ 40 ఇయర్స్ ఆ 5 ఇయర్స్ జగన్ పై పట్టు సాధించలేకపోతున్నారని తెలుస్తోంది. గెలిచే అవకాశాలు ఎన్ని ఉన్నా వాటిపై దృష్టి పెట్టకుండా, కొన్ని అనవసరపు పనులు చేస్తూ ప్రత్యర్థిని హైలెట్ చేస్తున్నారని చెప్పవచ్చు. విధంగా ఎంతో ఆసక్తిగా సాగే ఈ పోరులో ప్రజలు ఏ వైపు ఉన్నారనేది తెలుసుకుందాం..

 రాజకీయాల్లో ఎంతటి ఉద్దండులైనా  సరే ఒకటి రెండు సార్ల కంటే ఎక్కువ సార్లు అధికారం చేపట్టలేదు. వారు ఎన్ని మంచి పనులు చేసిన ఏదో ఒక దగ్గర తప్పు జరుగుతూనే ఉంటుంది ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తూనే ఉంటుంది.. ఆ విధంగానే  జగన్ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది. కనీసం ప్రతిపక్ష హోదా అనేది కూడా లేకుండా చేసిందని చెప్పవచ్చు.  అసలు టీడీపీ చరిత్రలోనే అంత తక్కువ సీట్లు వచ్చింది 2019లోనే అని  అనుకోవచ్చు. అలాంటి జగన్ ఈ 5 సంవత్సరాల కాలంలో  ఎన్ని పథకాలు తీసుకువచ్చినా కానీ  ఆయన కిందిస్థాయి లీడర్లంతా ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు అనే భావన ప్రజల్లోకి వెళ్లిపోయింది. అంతేకాకుండా ఇసుక దందాలు, మద్యం వ్యాపారాలు,  భూ కబ్జాలు, వైసీపీలో  ఉన్న వారికే ప్రభుత్వ  పథకాలు  ఇలా చెప్పుకుంటే పోతే బోలెడన్ని మైనస్ లు వైసీపీలో కనిపిస్తున్నాయి. దాదాపుగా చాలామంది ప్రజలు వైసీపీని ఎందుకు గెలిపించామురా బాబు అనే స్థితికి వచ్చారు. కానీ దీన్ని వాడుకోవడంలో చంద్రబాబు విఫలం అవుతున్నారు. కేవలం వన్ సైడ్ రాజకీయాలు చేస్తూ, తన వెనుక  ఏం జరుగుతుందని ఆలోచించడం లేదు. జగన్ వేసిన ఉచ్చులోనే ఆయన పడుతున్నారు.

 చంద్రన్న ఆలోచనకు పదును పెట్టాల్సిందే.!

 కోటి విద్యలు కూటి కోసమే అన్న సామెత ఎప్పటినుంచో ఉంది. అది రాజకీయాల్లో కూడా వర్తిస్తుంది.  గత ఎన్నికలకు ముందు కూడా కోడి కత్తితో రాజకీయం చేసిన జగన్ విపరీతమైన సింపతీ పొందారు. దాంతో ఎన్నికల్లో విజయం కూడా సాధించారు. అంతేకాకుండా ఈసారి  మరో కొత్త స్ట్రాటజీతో ముందుకు వచ్చారు. ఆయన ఏ సభలో మాట్లాడినా రాబోయేది నా ప్రభుత్వమే అని, నేనే సీఎం అవుతానని గట్టిగా చెబుతున్నారు.  అలాగే ఓవైపు దత్తపుత్రుడు, మరోవైపు చంద్రబాబు, ఇంకోవైపు బిజెపి, కాంగ్రెస్ ఇలా మీ బిడ్డను పడేయటానికి  ఇంతమంది తుపాకీ ఎక్కుపెట్టారని  జనాల్లో సింపతీ కలిగే విధంగా రాజకీయాలు చేస్తున్నారు. అంతేకాకుండా విజయవాడలో రాళ్ల రాజకీయంపై కూడా విపరీతమైన సింపతీ కూడగట్టుకున్నారు.


ఈ విధంగా తనదైన శైలిలో జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్న జగన్ కు, చంద్రబాబు  అడ్డుకట్ట వేయడంలో కాస్త విఫలమవుతున్నారని చెప్పవచ్చు. జగన్ ప్రభుత్వంలో విఫలమైన పనుల గురించి గానీ, ఆ నాయకులు చేసిన అరాచకాల గురించి గానీ, రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని చెబుతూ, ప్రజలకు భరోసా  ఇవ్వడంలో గానీ చంద్రన్న కాస్త వెనుకబడి పోతున్నారు. అంతేకాకుండా జగన్ రాయి రాజకీయం మొదలు పెడితే చంద్రబాబు, పవన్ కూడా అదే ఉచ్చులో పడిపోయారు.. వాళ్లపై కూడా రాళ్ళ దాడి జరిగిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ బోల్తా పడ్డారు.  అసలు ఈ రాళ్ల రాజకీయం గురించి చంద్రబాబు, పవన్ పట్టించుకోకుంటే ఆ ఇష్యూ అంతగా హైలైట్ అయ్యేది కాదు. కానీ వాళ్లే   జగన్ ను హైలెట్ చేస్తూ, వారు చేయాల్సినటువంటి పనులను మర్చిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ గెలిచే అవకాశాలు ఎన్ని ఉన్నా, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయే ప్రయత్నం చేయాలని, కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రన్న స్ట్రాటజీకి పదును పెడితేనే గెలుపు  సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: