ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలలో అనంతపూర్ జిల్లాలో ఉండే శింగనమల నియోజవర్గం చాలా ప్రత్యేకంగా మారుతోంది. ఎందుకంటే ఈసారి అక్కడ టిప్పర్ డ్రైవర్ కి సీటు ఇవ్వడంతో హాట్ టాపిక్ గా మారుతోంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన శింగనమల వైసీపీ అభ్యర్థిగా వీరాంజనేయులు కు టికెట్ ఇచ్చారు సీఎం జగన్.. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రచారంలో భాగంగా వెటకరిస్తూ మాట్లాడడంతో ఈ విషయం రాజకీయాలలో మరింత ప్రకంపనలు సృష్టించేలా కనిపించింది. అయితే సీట్ ఇచ్చిన వైసీపీ పార్టీ మాత్రం టిప్పర్ డ్రైవర్ కు సీటు ఇవ్వకూడదా.. ఏంటి అంటూ గర్వంగా ప్రకటించుకున్నారు.


అయితే ఇదంతా బాగానే ఉన్నా టిప్పర్ డ్రైవర్ను గెలిపించుకునేలా వైసిపి బాధ్యతలు చేపట్టడం లేదని అక్కడి నేతలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిరాకరించడంతో ఆమె మనస్థాపం చెందినట్లుగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ఈమె భర్త ప్రభుత్వ విద్య సలహాదారుడుగా ఆలూరి సాంబశివారెడ్డి పనిచేశారు. దీంతో అక్కడ అభ్యర్థి బాధ్యతలను కూడా ఈయనకే అప్పగించారు. దీంతో ఆయన తన కంపెనీలో పని చేసే ఒక టిప్పర్ డ్రైవర్ను కేటాయించారు.


అయితే ఇలా టికెట్ ఇచ్చినప్పటికీ గెలిపించుకునే స్థాయిలో సాంబశివారెడ్డి ఆర్థికంగా వనరులను ఖర్చు పెట్టలేదని విమర్శలు కూడా శింగనమల నియోజవర్గంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. టిడిపి తరఫున బండారు శ్రావణి బరిలో ఉన్నది. కాస్త టిడిపిలో కూడా ఈమె పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ.. సర్వేలు ఎటు చూసిన సింగనమలలో చాలా గట్టి పోటీ ఉంటుందని వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం పూర్తిగా సాంబశివారెడ్డి తీరే అన్నట్లుగా అక్కడి నేతలు ఎక్కువగా తెలియజేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కూడా ఎక్కడ ప్రచారంలో కనిపించడం లేదు.


సామాన్యుడైన టిప్పర్ డ్రైవర్ కి టికెట్ అయితే ఇచ్చామంటూ వైసీపీ గొప్పలు చెప్పుకున్నప్పటికీ.. అతన్ని చట్టసభలోకి తీసుకువచ్చేలా ఎలాంటి పన్నాగాలు చేయకపోవడంతో అక్కడి నేతలు అసంతృప్తితో ఉన్నారు.. చాలామంది నేతలు కూడా ఓడిపోవడానికి ఇక్కడ టిప్పర్ డ్రైవర్ ను పెట్టాల్సిన అవసరం లేదంటూ తెలుపుతున్నారు.. టిప్పర్ నైతే వీరాంజనేయులు నడపగలరేమో.. ఆయనను గెలుపు వరకు తీసుకువెళ్లాలంటే అది సాంబశివారెడ్డి చేతుల్లోనే ఉందంటూ పలువురు నేతలు తెలుపుతున్నారు. మరి ఇకనైనా సాంబశివారెడ్డి తీరు మార్చుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: