గత కొన్ని సంవత్సరాలుగా అటు వైసిపి టిడిపి జనసేన పార్టీ మధ్య మాటలు యుద్ధం జరుగుతూనే ఉంది. ఈసారి కూటమిలో భాగంగా బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ప్రచారం చేసుకుంటూనే వైసీపీ పార్టీని ఓడించాలని ప్రణాళికతో ప్రజలలోకి చాలా బలంగా తీసుకువెళ్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం సీఎం జగన్ పైన గుర్తుతెలియని వ్యక్తి రాయి దాడి చేయడంతో కావాలనే వైసిపినే చేయించుకుందనే విధంగా కూటమిలో భాగంగా చాలామంది నేతలు మాట్లాడారు. సింపతితో ఓట్లు అడగొచ్చు అంటూ చేసుకున్నారు అనే విధంగా మాట్లాడారు.చాలామంది నేతలు కూడా పలు రకాల వీడియోలతో ట్రోల్ చేయడంతో నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ పైన సీఎం జగన్  మాట్లాడారు.. ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ కూడా జగన్ తీరుపైన ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. మరి జగన్ నిన్న మాట్లాడిన మాటలు విషయానికి వస్తే.. దత్తపుత్ర దత్తపుత్ర పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి.. పిల్లల్ని పుట్టించి.. పెళ్లి కాగానే నాలుగేళ్లకు ఒకసారి ఐదేళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్లుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజవర్గాలను కూడా  వదిలేస్తూ ఉన్నావు.. ఏం మనిషి వయ్యా నువ్వు అంటూ జగన్ మాట్లాడడం జరిగింది.


అందుకే దత్తపుత్రునీలో ఈ మధ్యకాలంలో బీపీ బాగా కనిపిస్తోంది అంటూ మాట్లాడారు. అయ్యా దత్తపుత్ర ఒక్కసారి చేస్తే అది పొరపాటు.. మళ్లీ మళ్లీ చేస్తే దాన్నే అలవాటు అంటారయ్యా అంటూ దత్తపుత్ర అంటూ మాట్లాడారు. ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూడడం ఘోరమైన తప్పు కాదా అని అడుగుతున్నానని తెలిపారు జగన్. దీనిపైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను ఓడిపోతున్నాననే భయంతో ఇలా మాట్లాడుతున్నారంటూ తెలియజేశారు.


పవన్ కళ్యాణ్ జగన్ పైన ఇలా ఫైర్ అవుతూ.. ప్రత్యేకించి నామీద నీకు కోపం పెరిగిపోతోంది అది నాకు తెలుస్తోంది అంటూ మాట్లాడారు. నీ కోపానికి కారణం నువ్వు ఓడిపోతావనే నాకు బలంగా తెలుసు.. మా ప్రభుత్వం వస్తుందని తెలుసు వచ్చాక.. ఒక్కొక్క రౌడీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ వాళ్లకి శిక్ష పడేలా చేస్తామంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అంతేకాకుండా సీఎం జగన్ కు భయం చూపెడతానంటూ సవాలు విసిరారు పవన్.

మరింత సమాచారం తెలుసుకోండి: