ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహిళ నేతల్లో విడుదల రజిని ఒకరు. ఈమె ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతుంది. 2019వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈమె చిలకలూరిపేట నుండి పోటీ చేసి గెలుపొందింది. ఇక కొంతకాలం పాటు ఎమ్మెల్యే గానే పని చేసిన ఈమె ఆ తర్వాత జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె ఆరోగ్య , కుటుంబ సంక్షేమం , వైద్యవిద్య శాఖ మంత్రి గా బాధ్యతలను వ్యవహరిస్తోంది. ఇక మరికొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లలో ఈమె గుంటూరు వెస్ట్ నుండి పోటీ చేయబోతోంది.

ఇదే స్థానంలో ఈమెకు పోటీగా టీడీపీ నుంచి కొత్త అభ్యర్ది మాధవి బరిలోకి దిగారు. ఇక్కడ ఇద్దరు మహిళ అభ్యర్థులే కావడంతో పోరు రసవత్తరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు వెస్ట్ లో ఇద్దరు మహిళ అభ్యర్థులే అయినప్పటికీ ఇందులో కాస్త వైసీపీకి ఎడ్జ్ కనబడుతుంది. ఎందుకు అంటే వైసీపీ పార్టీ విడుదల రజిని నీ ఇక్కడ ఎమ్మెల్యే కాండేట్ గా డిసైడ్ చేసి చాలా రోజులు అవుతుంది. దానితో ఈమె దాదాపుగా మూడు నెలల కంటే ఎక్కువ రోజుల నుండి ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తుంది.

అలాగే క్యాడర్ ను కూడా బలపరుచుకుంది. ప్రచారాలను కూడా మొదలుపెట్టింది. ఇక మాధవి విషయానికి వస్తే ఈమెకు టికెట్ వస్తుందా..? లేదా..? అనేది కొన్ని రోజుల క్రితం వరకు కూడా కన్ఫామ్ కాలేదు. అనేక పరిశీలనలు, వాయిదాల తర్వాత మాధవికి సీట్ కన్ఫామ్ చేశారు. ఇలా ఈమెకు సీట్ కన్ఫర్మ్ కావడం లేట్ కావడం, ఈమె ప్రచారాలను కూడా ఇంకా బలంగా మొదలు పెట్టకపోవడం అది రజినీతో పోలిస్తే మాధవికి కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం రజిని మంత్రిగా పనిచేస్తుంది.

ఈమె మరోసారి విజయం సాధించి వైసిపి కూడా అధికారంలోకి వస్తే ఈమెకు మరో మంచి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. దానితో ఆ ప్రాంత ప్రజలు మంత్రి అయ్యే కాండిడేట్ కు ఓటు వేస్తే బాగుంటుంది అని ఆలోచనకు వచ్చినట్లు అయినా అది మాధవికి కాస్త నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. ఇలా కొన్ని విషయాలలో చూసుకుంటే మాధవి కంటే కూడా రజనీకి ఎడ్జ్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: