ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల రాజకీయం కూటమి, వైసీపీ పార్టీ మధ్య రోజురోజుకి హోరా హోరిగా మారుతోంది. ఎన్నికలలో ప్రచారంలో భాగంగా ఇరువురు పార్టీలు కూడా హోరెత్తిస్తున్నాయి. అయినప్పటికీ కొంతమంది నేతలు కూడా ఇతర పార్టీలోకి జంప్ అవుతూ ఉన్నారు. ఈసారి ఎన్నికలలో గోదావరి బలబల గాలు గెలుపును సైతం డిసైడ్ చేసేలా  కనిపిస్తున్నాయి. తాజాగా కోనసీమ నుంచి జనసేన నేత వైసీపీలోకి చేరబోతున్నట్లు తెలుస్తోంది.


గోదావరి జిల్లాలలో వైసీపీ పార్టీని ఒక్క సీటు కూడా గెలవనివ్వనంటూ పవన్ కళ్యాణ్ శపధం చేశారు.. గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు కూటమికే రావాలని అక్కడ ప్రజలను కూడా ఆర్జించారు పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎంతోకాలం పనిచేసిన కొంతమంది నేతలకు సీట్లు రాకపోవడంతో ఇప్పటికీ చాలామంది నేతలు జనసేన ను వీడి వైసీపీలోకి వెళ్లిపోయారు. అలా అమలాపురం ,మమ్మిడివరం ఇతరత్న ప్రాంతాల నుంచి నేతలు కూడా వైసీపీలోకి చేరారు. వీరితోపాటు విజయవాడ తూర్పు, పశ్చిమ ఇన్చార్జిలు కూడా వైసిపిలోకి చేరారు.


ఇప్పుడు తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో రాజోలులో జనసేన పార్టీకి పెద్ద షాక్ తగలబోతోందట. జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం.. కోనసీమ జిల్లాలో రోజురోజుకి రాజకీయ సమీకరణాలు మారిపోతూనే ఉన్నాయి. గత ఎన్నికలలో వైసిపి పార్టీ నుంచి రాజోలు అభ్యర్థిగా పోటీ చేసిన రాజేశ్వరరావు.. జనసేన అభ్యర్థి అయినటువంటి రాపాక వరప్రసాద్ గెలిచారు.. అయితే గెలిచిన తర్వాత వైసీపీ పార్టీలోకి వెళ్లడంతో రాజేశ్వరరావు జనసేన పార్టీలోకి వెళ్లారు. ఈ సమయంలోనే రాజోలు నుంచి రాజేశ్వరరావు సీటు ఆశించిన.. రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్ కు పవన్ కళ్యాణ్ అక్కడ సీటును కేటాయించారు.

దీంతో రాజేశ్వరరావుకు సీటు ఇవ్వకపోవడంతో ఆయన మద్దతుదారులు కూడా నానా హంగామా చేశారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ వైసీపీ పార్టీలోకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాలోని బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ సమక్షంలో తిరిగి వైసిపి లోకి చేరబోతున్నట్లు సమాచారం. ఈరోజు కాకినాడలో సీఎం జగన్ ను కలిసిన తర్వాత తాను వైసీపీలోకి తమ మద్దతు దారులతో వెళ్లబోతున్నట్లుగా సమాచారం. దీంతో జనసేన పార్టీకి కోనసీమలో పెద్ద దెబ్బ పడేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: