2014, 2019 ,2024 ఎన్నికలలో భాగంగా వైసిపి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేయబోతున్నారు. అందులో భాగంగా 175 నియోజకవర్గాలకు 25 పార్లమెంట్ నియోజకవర్గం కూడా అభ్యర్థులను ఖరారు చేశారు. వైయస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రను మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు సీఎం జగన్. దీంతో రోజురోజుకి వైసిపి ఆదరణ పెరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ  బస్సు యాత్ర ఈరోజుకి 17వ రోజుకి చేరినట్లు తెలుస్తోంది.


అయితే అనూహ్యంగా కోస్తాలోని కనీవిని ఎరుగని రీతిలో సైతం మద్దతు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో యాత్ర పూర్తి చేసుకున్నటువంటి జగన్ విజయవాడలో అడుగుపెట్టగానే నిలువెత్తున జన సమూహంతో నిండిపోతోంది.. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా చేసిన పాదయాత్రను సైతం గుర్తుచేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ ప్రజల్లో కనిపించగానే జనంలో మాటలలో చెప్పలేని ఉత్సాహం కనిపిస్తున్నట్లుగా అక్కడ నేతలు తెలియజేస్తున్నారు.. అసలు ఇంతటి ప్రజాధరణ వైసిపిని అసలు ఊహించలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో పూర్తిచేసుకుని తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించారు  జగన్..


ముఖ్యంగా గుంటూరు, కృష్ణ, కుభయగోదావరి జిల్లాలలో పాటు విశాఖపట్నం జిల్లా పైన కూటమి చాలా ఆశలు పెట్టుకుంది.. అయితే ఇక్కడ వైసిపి ఆదరణకు వచ్చిన విషయాన్ని గమనిస్తే కూటమి అంచనా అసలు అందుకోలేకపోతోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. జగన్ వెంట వస్తున్న జనాన్ని చూసి కూటమి కచ్చితంగా షాక్ గురయ్యాలా కనిపిస్తోంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా వరకు జగన్ యాత్ర బాగానే కొనసాగింది. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువగా జనం రావడంతో కూటమినేతలలో భయం కనపడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.సీఎం జగన్ కు ప్రజాదరణ పోటీగా తామేమి తక్కువ కాదని నిరూపించుకోవడానికి కూటమి కూడా పోటీ పడుతోంది. అలాగే ఉభయగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ వల్ల రాజకీయ ఉపయోగం ఉంటుందని టిడిపి ఆశించినప్పటికీ.. ఇప్పుడు జగన్ యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి కూటమిలో నిరుత్సాహం మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అలాగే కూటమే తమ కొంప కోస్తాలో ముంచేలా కనిపిస్తోందని భావన టిడిపిలో నెమ్మది నెమ్మదిగా బలపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: