సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మేధావులుగా గుర్తింపు పొందిన అందరూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే వీరు టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసే కుహనా మేధావులు అంటూ జగన్ టీమ్‌ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయం గురించి ప్రజలకు బాగా తెలిసేలా సాక్షి మీడియా సంస్థను కూడా ఏపీ సీఎం జగన్ వాడుకుంటున్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ కి కార్యదర్శిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్క్ చేస్తున్నారు. ఇంతకుముందు అంటే 2021 వరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా విధులు నిర్వర్తించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా పనిచేస్తున్న సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఎలక్షన్ కమిషనర్ పదవిని అందించారు.

చంద్రబాబు నాయుడు ఈ హోదా కల్పించినందుకు గాను నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా ఫేవర్స్ చేశారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా 2018 ఆగస్టులో పంచాయతీ సర్పంచ్ పదవి కాలం తీరిపోయినప్పటికీ ఆయన వాటికి ఎన్నికలు నిర్వహించలేదని అంటారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడుకి రాజకీయ ప్రయోజనాలు అందించాలనే ఉద్దేశమే అని విమర్శలు వినిపించాయి. 2019లో భారీ మెజారిటీ తో జగన్ సీఎం అయ్యారు అయితే 2020లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా దానిని వాయిదా వేశారు ఎందుకంటే ఈ ఎన్నికల్లో సగానికి పైగా స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని, దీనివల్ల టీడీపీ చులకన అవుతుందనే భావనతో ఆయన వాటిని వాయిదా వేశారు.

కరోనా కారణంగా వాటిని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు చెప్పారు. ఆ సమయంలో ఆయన పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదానికి ఆయన ఒక కేంద్ర బింధువు కూడా అయ్యారు. ఎంపీటీసీ జడ్పిటిసి నామినేషన్లు పూర్తయ్యాక కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాంటి ముందస్తు సమాచారం అందించకుండా వాటిని వాయిదా వేశారు. అంతేకాదు జగన్ వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి అన్ని సంక్షేమ పథకాలనే ఇంటికి తీసుకొస్తూ ఉంటే దానివల్ల వైసీపీ కి ప్రజాదారణ ఎక్కడ పెరిగిపోతుందో అని దానికి కూడా బ్రేకులు వేయించారు ఢిల్లీ హైకోర్టు, రాష్ట్ర హైకోర్టుతో సహా సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ వాలంటీర్ వ్యవస్థను ఆపాలని పిటీషన్లు వేశారు. దీనివల్ల వాలంటీర్ సర్వీస్ ఆగిపోగా అవ్వ, తాతలు రోడ్ల మీదకు రావాల్సి వచ్చింది. ఫలితంగా టిడిపికే ఎక్కువ నెగిటివిటీ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: