* చంద్రబాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడమే పెద్ద పొరపాటు

* టీడీపీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్న ఒపీనియన్ పోల్స్  

* కానీ బీజేపీ పొత్తు కారణంగా టీడీపీ గెలుపుకు అడ్డంకులు

( ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

చంద్రబాబుకు పాలిటిక్స్ లో 40 ఏళ్ల అనుభవం ఉంది కానీ ఈసారి ఆయన అన్నీ తప్పులే చేస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో రావాల్సిన ఆదరణ కూడా రాకుండా పోతుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, మీడియా, సోషల్ మీడియా ద్వారా సానుకూల ఇమేజ్‌ని ప్రచారం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ మాత్రం ఆ విషయంలో ఫెయిల్ అవుతుంది. ఒక సంవత్సరానికి ముందు వైసీపీ పాలనపై చాలానే విమర్శలు వచ్చాయి. అభివృద్ధి లేదు, పంచుడు కార్యక్రమాలు చేపడుతున్నారు, దీనివల్ల రాష్ట్రం దివాలా తీసే ప్రమాదం ఉందని అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్రజలే వైసీపీ పాలన మంచిగా ఉంది అని పొగుడుతున్నారు.

ఈ నేపథ్యంలో రీసెంట్ ఒపీనియన్ పోల్స్ టీడీపీ+ కూటమికి ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేదు అని అభిప్రాయపడ్డాయి. న్యూస్‌ఎక్స్, డీ-డైనమిక్స్‌ల సర్వే ప్రకారం టీడీపీ 14 సీట్లు గెలుచుకోగా, దాని భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీలు చెరో రెండు సీట్లు గెలుస్తాయని అంచనా వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేవలం ఏడు సీట్లకే పరిమితమైనట్లు కనిపిస్తోంది.

కూటమిలోని మిత్రపక్షాల మాదిరిగా బీజేపీ మంచి పనితీరు కనబర్చడం లేదని సర్వే ఫలితాల వివరణాత్మక విశ్లేషణ సూచిస్తోంది. 17కి గాను 14 స్థానాల్లో విజయం తమదేనంటూ టీడీపీ పోటీ చేసిన చాలా స్థానాలను కైవసం చేసుకుంటోంది. జనసేన పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం సాధించి 100% సక్సెస్ రేటును సాధించింది. అయితే, బీజేపీ పోటీ చేసిన ఆరు స్థానాల్లో కేవలం రెండింటినీ మాత్రమే గెలుచుకోగలిగింది, ఇది కూటమికి బలహీనమైన అంశంగా పరిగణించబడుతుంది. బీజేపీకి కేటాయించిన స్థానాల్లో టీడీపీ, జనసేన పోటీ చేసి ఉంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సీట్ల సంఖ్య మూడు లేదా నాలుగుకు తగ్గే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.

ఈ కోణంలో చూసుకుంటే కూటమి వల్ల చంద్రబాబుకు లభించే లాభాల కంటే జరిగే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. కుంటి గుర్రం లాంటి బీజేపీని కలుపుకోవడం చంద్రబాబుకు పెద్ద భారమే అయిందంటూ కొందరు విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: