ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఎన్నికల కీలక దశకు చేరుకుంటున్నాయి. కీలకమైన ముఖ్య నేతలు కూడా నామినేషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు. సీఎం జగన్ బస్సు యాత్రను తూర్పుగోదావరిలో కొనసాగిస్తూ ఉన్నారు. పవన్ కూడా ఈ నెల 23న పిఠాపురంలో నామినేషన్ వేశాలా చూస్తున్నారు. ఈరోజు చంద్రబాబు కుప్పంలో నామినేషన్ దాఖలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే అన్ని పార్టీలకు అధికారంలోకి రావడానికి కీలకమైన గోదావరి జిల్లాలో ఈరోజు జగన్ పర్యటించబోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నిలబడిన పిఠాపురం నియోజవర్గంలో రోడ్డు షో చేస్తున్నట్లు తెలుస్తోంది.


బస్సు యాత్రలో భాగంగా ఎస్టీ రాజపురం లో రాత్రి బసచేసిన తర్వాత అక్కడి నుండి  బయలుదేరి.. రంగంపేట, పెద్దాపురం, సామర్లకోట బైపాస్ మీదుగా వెళ్ళనున్నారు. సాయంత్రం మూడు గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద సభలో పాల్గొని ఆ తర్వాత పిఠాపురం బైపాస్.. గొల్లప్రోలు బైపాస్ మీదుగా కత్తిపూడి, తుని, పాకరాయపేట బైపాస్ మీదుగా వెళ్లి గోడిచర్ల క్రాస్ వద్ద రాత్రి బస చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పైన సీఎం జగన్ రోడ్ షో నిర్వహిస్తూ ఉండడమే కాకుండా.. ఇదివరకే ముఖ్యమైన నేతలను కూడా పిఠాపురం నియోజవర్గంలో పలు రకాల దిశా నిర్దేశం చేశారు.


పవన్ కళ్యాణ్ మీద పిఠాపురంలో వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేయబోతున్నారు. పిఠాపురంలో ఈమె గెలుపు ఖాయమని అక్కడి నేతలు కార్యకర్తలు భావిస్తూ  ఉన్నారు.. ముఖ్యంగా వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమాలకే పెద్దపీట వేయడంతో అక్కడి నేతలు ధీమాగా ఉన్నారు.రేపటి రోజున పవన్ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా పిఠాపురం కి రాబోతున్నారు. ఇలాంటి సమయంలోనే జగన్ పవన్ ని ఓడించడానికి సరికొత్త స్కెచ్ను సిద్ధం చేశారు. ఈరోజు రాత్రి బస చేసిన తర్వాత కాకినాడ పార్లమెంట్ పరిధి ఉండేటువంటి నేతలకు అందరితో మాట్లాడి అక్కడ అందరిని ఒకటి చేసేలా పలు రకాల కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉంది.. ఏవైనా మార్పులు చేర్పులు చేయాలనే విషయం పైన కూడా  lఅడిగిమరి తెలుసుకోబోతున్నారట.. అలాగే ఈ నెల 25 తర్వాత సీఎం జగన్ కూడా మళ్లీ పలు రకాల సభలలో కూడా పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల గోదావరి జిల్లాలో వైసీపీ పార్టీకి వచ్చిన మద్దతు చూసి ప్రతిపక్ష నేతలు కూడా భయపడుతున్నారు. అలాగే సీఎం జగన్ కూడా పలు రకాల సభలలో తమ హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలను, సంక్షేమాలను గురించి వివరిస్తూ పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేశారు. ముఖ్యంగా జగన్ యాత్రకు వచ్చిన స్పందన వల్ల వైసీపీ నేతలు మరింత ధీమాతో ఉన్నారు. మరి పిఠాపురంలో వైసిపి నేతలు వేస్తున్న స్కెచ్ పవన్ కళ్యాణ్ చిక్కుకుంటారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: