ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక వ్యూహంతోనే రాజకీయం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల ప్రత్యేకంగా ఒక బ్యాకప్ టీం ఏర్పాటు చేసుకుని కీలక నియోజకవర్గం ఉన్నచోట్ల ప్రభావం చూపే నాయకులను పార్టీలోకి ఆహ్వానించి మరి టిక్కెట్లు ఇస్తున్నారు. ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, కేంద్ర మాజీ మంత్రి వైసీపీలో చేరి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వైసీపీ సీటింగ్ ఎమ్మెల్యేలు అందరూ దళితులే కావ‌టం విశేషం.


అంతేకాదు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తమ తమ నియోజకవర్గాలలో తమ తమ సామాజిక వర్గాలలో పట్టున్నవారే. పైగా ఆర్థికంగాను బలంగా ఉన్నవారే. నందికొట్కూరు నుంచి వైసీపీ సీటు రాని ఆర్ధర్, చింతలపూడి నుంచి ఎలీజా, పూతలపట్టు నుంచి ఎమ్ఎస్ బాబు, పి గన్నవరం నుంచి ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్‌లో చేరి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. వీరు వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావడంతో కాస్తో కూస్తో వీరికి లోకల్ గా పట్టు ఉంది. వీరు ఎన్నికలలో విజయం సాధించకపోయినా ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థులను ఓడించేలా ఓట్లు చీల్చుతారన్న అంచనాలు అయితే ఉన్నాయి.


ఇక వైసీపీలో తీవ్ర అవమానానికి గురైన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి.. జగన్ పై తీవ్ర ఆరోపణలు చేసి కాంగ్రెస్‌లో చేరి టెక్కలి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇలా కనీసం 25 నుంచి 30 నియోజకవర్గాలలో కాంగ్రెస్ బలమైన అభ్యర్థులను నిలబెడుతోంది. వీరి బలం గెలవడానికి సరిపోదు. కానీ వైసీపీని ఓడించడానికి ఉపయోగపడుతుంది. ఈసారి ఏపీలో షర్మిల ప్రభావం గట్టిగా కనిపిస్తోంది. కీలకమైన స్థానాల్లో 10 నుంచి 15 వేల ఓట్లు చీలిస్తే పోటీలో ఉన్న వైసీపీ అభ్యర్థుల జాతకాలు తారుమారు అవుతాయి.


అలా బలం చూపించే అభ్యర్థులనే షర్మిల ఎంపిక చేస్తూ వస్తున్నారు. ఇక షర్మిల కడపలో 1,50,000 ఓట్లు చీలిస్తే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఓడిపోతాడని అంచనాలు ఉన్నాయి. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ ఓట్లు బలంగా చీల్చింది. లోక్ స‌త్తా రెండు శాతం ఓట్లు చీల్చింది. లోక్ స‌త్తా ఎన్నికలలో పోటీ చేయకుండా ఉండి ఉంటే కచ్చితంగా ఆ రెండు చోట్లా ఓట్లు టీడీపీకే పడేవి. ఆ ఎన్నికలలో టీడీపీ గెలిచినా గెలిచి ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వైసీపీని ఓడించటానికి అదే గేమ్ ప్లాన్ తో ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: