జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు.. దీంతో పవన్ కళ్యాణ్ ని దైవంగా భావించేటువంటి పలువురు జబర్దస్త్ కమెడియన్స్ కూడా పవన్ కళ్యాణ్ ని ఈసారి ఎలాగైనా గెలిపించాలని ఉద్దేశంతో నాన్న ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలన్నీ కూడా సినిమాల లాగే ఉన్నాయని మెలోడిడ్రామాలు, ఎమోషనల్ స్పీచ్లు ,గుండెలుబాదుకోవడం ఇతరత్రా అన్ని కూడా సినిమా టిక్కుగానే కనిపిస్తున్నాయి. వాటికి తోడు ఈ జబర్దస్త్ కమెడియన్స్ కూడా అదే ధోరణిలో వెళుతున్నారు.


పిఠాపురం మొత్తం జబర్దస్త్ కమెడియన్ల తోనే నింపేసి పవన్ ప్రచారాన్ని కూడా కామెడీగా మార్చేసిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఒక్కసారిగా అక్కడ పార్టీ శ్రేణులలో వ్యతిరేకత కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను లక్ష్య మెజారిటీ వస్తుందంటు చెప్పుకొని తిరుగుతున్న క్యాంపెనర్ జబర్దస్త్ కమెడియన్ ఆది.. పిఠాపురంలో  మాత్రం 2 లక్షల 35 ఓట్లు ఉన్న పిఠాపురంలో లక్ష మెజారిటీ ఓట్లు రావాలి అంటే.. దాదాపుగా లక్షన్నర ఓట్లు రావాలి.. కానీ గతంలో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి మరో నియోజకవర్గం మారి పోటీ చేస్తున్నారు.


అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కే అన్ని ఓట్లు వస్తే అక్కడ 30 ఏళ్లుగా రాజకీయ చరిత్ర ఉన్న సీనియర్ నేత వైసిపి అభ్యర్థి వంగా గీతాకు ఎన్ని ఓట్లు వస్తాయి అంటూ కూడా లెక్కేస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్స్ పదే పదే ప్రచారంలో భాగంగా ఇదే విషయాన్ని రిపీట్ చేస్తూ ఉండడంతో అక్కడ జనసేన శ్రేణులలో చిరాకు తెప్పించుతోందట. వీరికి తోడు నటుడు పృథ్వీరాజ్.. ఇంకా కామెడీ చేస్తున్నారు. జగన్ లాంటి నాయకులు వీధికొకరు ఉంటే పవన్ కళ్యాణ్ నాయకులు స్టేట్ కొకరు ఉంటారు అంటూ తెలుపుతున్నారు.. ముఖ్యంగా ప్రజా సమస్యల పైన పోరాడే ఏకైక నాయకుడు పవనేనంటూ నానా హంగామా చేస్తున్నారు. ఇలా జబర్దస్త్ కమెడియన్స్ చేస్తున్న ప్రచారం వల్ల పవన్ కళ్యాణ్ నవ్వుల పాలవుతున్నారని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: