తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని సాధించి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రముఖ నేత అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆయనతో ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయించుకునేందుకు షెడ్యూల్ ఖరారు చేస్తోంది. తాజాగా రెండు రోజుల పాటు కేరళలో ప్రచారం కూడా చేశారు. అక్కడ కేరళ ప్రభుత్వంపై, సీఎం పినరన్ విజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు.


తెలంగాణలో నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలైంది. తెలంగాణ ప్రచారంతో పాటు తమిళనాడు, మొదటి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోను ప్రచారం చేయనున్నారు.  సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డికి తెలుగు వారితో పాటు పొరుగు రాష్ట్రాల్లోను ఇమేజ్ పెరిగిపోయింది.  దీంతో తెలుగు ఓటర్లను ఆకట్టుకునేలా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటకలో ప్రచారం చేశారు. తాజాగా లోక్ సభ ఎన్నికల్లోను ప్రచారం చేయనున్నారు.


ఇక ఏపీలో సీఎం రేవంత్ ఒక బహిరంగ సభకు హాజరయ్యారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో జోష్ వచ్చింది. దీంతో మరో నాలుగైదు సభల్లో పాల్గొనేలా వ్యూహ రచన చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్ కూడా వెళ్తారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులన తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు.


అయితే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడింది. దీంతో పార్టీలో రేవంత్ స్థాయి అంతకంతకు పెరుగుతోంది. అయితే తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పదికి పైగా సీట్లు సాధించి పెడితే ఆయన పలుకుబడి హైకమాండ్ వద్ద మరింత పెరుగుతుంది.  ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం.. ఆ పార్టీ సీఎం లు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తారని.. తెలంగాణ అసెంబ్లీ అప్పుడు కూడా సీఎం సిద్దరామయ్య, హిమచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ లు వచ్చారనే విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: