ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన కేవలం 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ 21 స్థానాలలో మెజారిటీ స్థానాలలో జనసేనకు భారీ షాక్ తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంతో పోల్చి చూస్తే జనసేనకు మెరుగైన ఫలితాలే వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఎన్ని స్థానాలలో విజయం సాధించినా జనసేన పుంజుకునే ఛాన్స్ అయితే లేదనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇతర హీరోల ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పవన్ మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో చాలామంది నటులు ఇతర పార్టీలలో ఉన్నారని ఆ నటులు సీనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు చేసినా వారిని ఎన్టీఆర్ ఇబ్బంది పెట్టలేదని కామెంట్లు చేశారు.. అదీ ఎన్టీఆర్ సంస్కారం అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. టీడీపీతో గతంలో వ్యక్తిగత విభేదాలు ఉన్నా నా సినిమాలను ఎప్పుడూ ఆపలేదని పవన్ పేర్కొన్నారు.
 
సీఎం జగన్ చిరంజీవి, ప్రభాస్, మహేశ్ లను అగౌరవపరిచారని హీరోలంటే జగన్ కు కుళ్లు అని కలుగులో ఎలుకలాంటి జగన్ అది తట్టుకోలేరని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. సినిమా టికెట్ల ధరలతో హీరోలకు సంబంధం లేదని పవన్ వెల్లడించారు. చిరంజీవిని కించపరిచిన వ్యక్తి జగన్ అని ప్రభాస్, మహేశ్, తారక్, చరణ్, బన్నీ ఫ్యాన్స్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని పవన్ కామెంట్లు చేశారు.
 
అయితే పవన్ చేసిన కామెంట్లకు వైసీపీ నుంచి కొన్ని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి, మహేశ్, ప్రభాస్ లతో జగన్ తమను అగౌరవపరిచారంటూ చెప్పించాలని అప్పుడే ఆ కామెంట్లలో నిజం ఉందో తెలుస్తుందని వైసీపీ ఫ్యాన్స్ చెబుతున్నారు. జనసేన ఓట్ల కోసం ఇతర హీరోల అభిమానులను వైసీపీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టి లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ తరహా కామెంట్ల వల్ల పవన్ కు లాభం కంటే నష్టం ఎక్కువని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. మంత్రాలకు చింతకాయలు రాలవని పవన్ చెప్పిన ప్రతి మాటను ఇతర హీరోల ఫ్యాన్స్ నమ్మరని సామాన్యుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ టికెట్ రేట్లు పెంచడం వల్లే ఎన్నో సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయని ఈ సందర్భంగా వైసీపీ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: