ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నేళ్ల నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు( ఆర్ఆర్ఆర్ ) పేరు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఉండి నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆర్ఆర్ఆర్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఏపీలో ఎమ్మెల్యే సీట్ కు ఉన్న డిమాండ్ ఎంపీ సీటుకు లేదని ఆయన చెబుతున్నారు. నా నాలుకే నాకు వరం అని నా నాలుకే నాకు శాపం అని ఆర్ఆర్ఆర్ పేర్కొన్నారు.
 
ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరిక మేరకు బీజేపీ నాకు నరసాపురం ఎంపీ  టికెట్ ఇవ్వలేదని ఆయన కామెంట్లు చేశారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఆర్ఆర్ఆర్ పేర్కొన్నారు. గత రెండు నెలల రాజకీయాల్లో ఊహించని అనుభవాలు ఎదురయ్యాయని అయితే ఆ అనుభవాలను నేను ఎంజాయ్ చేశానని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. అంత రెచ్చిపోకురా రేయ్ అని నా అంతరాత్మ చెబుతోందని ఆయన కామెంట్లు చేశారు.
 
కూటమి విజయం సాధిస్తే తాను స్పీకర్ అవుతానని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని నాకు తాజాగా సీటు కన్ఫామ్ అయిందని ఆర్ఆర్ఆర్ వెల్లడించడం గమనార్హం. భవిష్యత్తులో చంద్రబాబు గురించి నెగిటివ్ గా మాట్లాడాల్సిన అవసరం రాదని చంద్రబాబు గుడ్ రూలర్ అని ఆయన తెలిపారు. చంద్రబాబు నాకన్నా వయస్సులో పెద్ద అని ఆయనపై గౌరవం ఉంటుందని జగన్ నా ముందు బాలుడు అని ఆర్ఆర్ఆర్ తెలిపారు.
 
యాంటీ జగన్ కు నేనొక సింబల్ అయ్యానని ఆయన వెల్లడించారు. కూటమికి 125 సీట్లు వస్తాయని ఆయన కామెంట్లు చేశారు. ఏపీలో వైసీపీ విజయం సాధిస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ జగన్ మళ్లీ  సీఎం అయితే రాష్ట్రంలో మనుషులు ఉండరని ఆ ఊహే భయంకరమని అసలు జగన్ ఏపీలో ఉండరని ఆయన అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ లేదని ఆర్ఆర్ఆర్ పేర్కొన్నారు. జగన్ సీఎం కావడం జరగదని ఆయన వెల్లడించారు. కూటమి అధికారంలోకి వస్తే జగన్ ను టార్గెట్ చేసే ఛాన్స్ ఉందనే అర్థం వచ్చేలా రఘురామ కృష్ణంరాజు కామెంట్లు చేయడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: