ఏపీ పొలిటికల్ వర్గాలలో, సినీ వర్గాలలో జ్యోతిష్కుడు వేణుస్వామి పేరు ఎప్పుడూ మారుమ్రోగుతూ ఉంటుంది. పాజిటివ్ గా అయినా నెగిటివ్ గా అయినా ఆయన పేరు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి 2019లో జగన్ సీఎం అయిన వెంటనే నేను టీడీపీకి, చంద్రబాబుకు ఒక సలహా ఇచ్చానని మూడేళ్ల పాటు జగన్ మానాన జగన్ ను వదిలేయాలని నేను చెప్పానని చివరి రెండేళ్లు మాత్రం జగన్ పాలనపై విమర్శలు చేయాలని చెప్పానని ఆయన పేర్కొన్నారు.
 
టీడీపీ నేతలు మాత్రం జగన్ సీఎం అయిన క్షణం నుంచి విమర్శలు చేశారని వేణుస్వామి వెల్లడించారు. టీడీపీ డ్యామేజ్ కావడానికి స్వయంకృతాపరాధం కారణం అని ఆయన అన్నారు. కొన్ని నెలల క్రితం వరకు టీడీపీ గెలుస్తుందనే అభిప్రాయం ఉందని పొత్తు ప్రకటించిన తర్వాత ప్రస్తుతం వైసీపీ గెలుస్తుందని వేణుస్వామి పేర్కొన్నారు. నేను చెప్పిన వాటిలో 100లో 99 శాతం జరుగుతాయని ఆయన వెల్లడించారు.
 
నా జ్యోతిష్యం 3 శాతం ఓటు బ్యాంక్ ను మార్చుతుందని రాజకీయ నేతలు నమ్ముతారని వేణుస్వామి అన్నారు. ఎన్నికలు పూర్తైన తర్వాత జగన్ కు సమస్యలు వస్తాయని ఆయన తెలిపారు. లోకేశ్ కు ఎడ్జ్ ఉందని చంద్రబాబు, పవన్, బాలయ్యలకు టగ్ ఆఫ్ వార్ ఉందని వైసీపీ నుంచి రోజా, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబులకు టగ్ ఆఫ్ వార్ అని వేణుస్వామి కామెంట్లు చేశారు. వైసీపీ మంత్రులలో మరి కొందరు ఓడిపోతారని ఆయన అన్నారు.
 
కేటీఆర్ జాతకంలో కారాగార దోషం ఉందని ఆయన జైలుకు వెళ్లే అవకాశం ఉందని వేణుస్వామి వెల్లడించారు. రాబోయే 14 నెలల్లో ఆయన జైలుకు వెళ్తారని వేణుస్వామి పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన యాగ ఫలితాల వల్ల ఆయనకు ఇబ్బందులు లేవు కానీ పార్టీలో సంచలనాలు చోటు చేసుకుంటాయని వేణుస్వామి అన్నారు. పార్టీ పేరు మార్చడం వల్లే కేసీఆర్ పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందని వేణుస్వామి వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: