ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ నాయకులకు ప్రేమ పుట్టుకొస్తోంది. ఇప్పుడు రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న పురందేశ్వరి గెలిస్తే కేంద్ర మంత్రి కూడా అయిపోగలరని ఆశలో మునిగితేలుతోంది. ముఖ్యంగా వైసిపి పార్టీని గెలిపిస్తే రాష్ట్రాన్ని తలలేని మొండెం లా తయారు చేస్తుందంటూ పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద పురందేశ్వరి బాదంతా రాష్ట్రానికి రాజధాని లేకపోవడం అన్నమాట అన్నట్లుగా తెలుస్తోంది.. కేవలం రాష్ట్రం బాగుండాలి అంటే కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావాలంటూ తెలియజేసింది.


అయితే ప్రజల దృష్టిలో మెలుగుతున్న సందేహాలు మాత్రం చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడే పురుందేశ్వరి చెబుతున్నట్టుగానే అటు చంద్రబాబుకు ఇటు మోడీకి ఇద్దరికీ కూడా అధికారం కట్టబెట్టారు.. మరి ఆ ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఏం చేశారనే విధంగా పురందేశ్వరిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు మొదటి 5 ఏళ్లలో ఏం వెలగబెట్టారు అంటూ ప్రజలు అడుగుతున్నారు.. ముఖ్యంగా మోడీ చేసిన ద్రోహం సంగతి ఏంటి అంటూ కూడా పురందేశ్వరిని ప్రజలు అడుగుతున్నారు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అందరూ పాట పాడుతున్నా.. అమరావతి శంకుస్థాపనకు మోడీ ని పిలిస్తే.. కేవలం నీళ్లు మట్టి తెచ్చి ఇచ్చి వెళ్లిపోయారు అంటూ తెలియజేస్తున్నారు.


వైయస్సార్సీపి 151 సీట్లతో గెలిస్తే ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి అంటూ పురందేశ్వరి ఆరోపించారు.. కానీ రాజధాని లేకుండా తల లేని మొండం చేశారంటూ మాట్లాడగా.. ప్రజలు మాత్రం బిజెపి పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పు చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల పాటు ఇస్తామంటూ తిరుపతి వెంకన్న పాదాల మీద సాక్షిగా ప్రమాణం చేసిన మోదీ గారే మాట తప్పారు అంటూ అడుగుతున్నారు.. బిజెపి చేసిన ఈ వంచనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ మర్చిపోరని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అంత ప్రేమ ఉంటే ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం పైన ఒత్తిడి తేవాలంటూ ప్రశ్నిస్తున్నారు.మొత్తానికైతే వైసీపీ పై విమర్శలు చేస్తున్న పురందేశ్వరిని దృష్టిలో పెట్టుకొని.. ఇప్పుడు బిజెపి తమకు ఏం చేసింది అంటూ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు ఓటర్స్.. మరి ఓటర్స్ టార్గెట్ చేశారంటే పురందేశ్వరి ఎంపి అవడం కష్టమే..

మరింత సమాచారం తెలుసుకోండి: