ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలో కడప జిల్లా అంటే వైయస్ కుటుంబానికి పెట్టింది పేరు.. వైయస్ కుటుంబంలో సీఎం జగన్ ఆయన చెల్లెలు షర్మిల మధ్య ఈమధ్య రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా వీరిద్దరి మధ్య విభేదాల కారణంగా ఈసారి ఎన్నికలు చాలా ప్రత్యేకంగా నిలుచున్నాయి. సీఎం కాకముందు జగన్ జైలుకు వెళ్లిన తర్వాత వైసీపీ పార్టీని పశిష్టం చేసేందుకు షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి క్రేజ్ ని సంపాదించింది. అలాగే వైసిపి పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడింది షర్మిల.


ఆ తర్వాత కొన్ని కారణాల చేత తన అన్నతో విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టినప్పటికీ అక్కడ కూడా పాదయాత్రను చేసింది. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల చేత కాంగ్రెస్లోకి విలీనం చేసి ఏపీసిసి అధ్యక్షురాలుగా మళ్లీ తిరిగి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టింది. ఇటీవలె కడప ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కమలాపురం రాజంపేట మినహా అన్ని స్థానాల్లో కూడా పోటీ చేస్తోంది .కానీ కడప నియోజకవర్గంలో మైనార్టీలలో కీలకపాత్ర కావడం చేత అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మైనార్టీ నేత అఫ్జల్ ఖాన్ ను బరిలో దింపేలా ప్లాన్ చేస్తోంది షర్మిల.


కేవలం వైసీపీ గెలుపును గండి కొట్టడానికి షర్మిల ఇలా చేస్తోందని అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. అఫ్జల్ ఖాన్ 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున శాసనసభకు పోటీ చేయగా అక్కడ 14 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోని అతనిని కూడా బరిలో దింపితే మైనారిటీ ఓట్లు చీలుతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది షర్మిల. అంతేకాకుండా వైసీపీకి సహజంగానే కాస్త వ్యతిరేకత ఉన్నదని ఈ పరిస్థితులలో ఓట్ల చీలిక  ఆ పార్టీకి చాలా ఇబ్బంది కలిగిస్తుందని వాదన కూడా వినిపిస్తున్నది. మరి షర్మిలా వేస్తున్న ఈ ఎత్తులు ఎంత మేరకు ఫలిస్తాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: