ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కనుమరుగు ఐపోయిన పార్టీ కాంగ్రెస్. అయితే  2014లో చచ్చుబడిపోయిన కాంగ్రెస్ పార్టీ 2019 నాటికి పోటీ చేయడానికి మళ్లీ ఉత్సాహం తెచ్చుకుంది. ఈసారిమాత్రం పోటీ కాదు అసెంబ్లీకి మేము వెళ్తామని కూడా ధీమాగా ఉంది.దానికి కారణం వైఎస్సార్ కుమార్తె షర్మిల ఏపీసీసీ చీఫ్ కావడమే.ఆమెకున్న తండ్రి రాజకీయ వారసత్వంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో కొంతవరకైనా ఓట్లు సాధించవచ్చు అన్న వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు.దాంట్లో భాగంగానే షర్మిలను కడప ఎంపీగా పోటీ చేయిస్తున్నారు.కాంగ్రెస్ కి ఈ ఎన్నికల్లో ఎన్నో కొన్ని ఓట్లు సాధిస్తుంది కానీ అలా వచ్చినా ఓట్లు ఎక్కడ నుంచి వస్తాయి అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చర్చగా ఉంది. ఇక వైఎస్సార్ ఫ్యామిలీకి కడప అనేది కంచుకోట.కేవలం ఆ కుటుంబాన్ని చూసే ఓట్లు వేస్తారు.అలా చూసుకుంటే మాత్రం కడప ఎంపీగా షర్మిల పోటీ చేయడం వల్ల ఏ పార్టీకి ఎంత నష్టం అనేది అక్కడ చర్చననీయాంశంగా ఉంది.

ప్రస్తుతం కడపలో టీడీపీ నేతలు వారి స్పీచుల కంటే కూడా షర్మిల, సునీత మాటలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలా చూసుకుంటే టీడీపీ వాళ్లు సొంత పార్టీ ప్రచారం కంటే కూడా షర్మిల, సునీత ప్రచారాన్నే వాడుకుంటున్నారు. అలాగే వైసీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి కూడా టీడీపీ కంటే షర్మిల, సునీతల పైనే  ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు.షర్మిల తన వాక్ చాతుర్యంతో కాంగ్రెస్కి కొన్ని ఓట్లు తెచ్చి పెడితే అవి ఏ పార్టీ నుండి ఓట్లు చీలుతాయో అనేది కూడా చర్చగా మారింది.ఐతే షర్మిల కాంగ్రెస్ కోసం చీల్చే ప్రతీ ఓటూ వైసీపీకే నష్టం అని అంటున్నారు.కానీ టీడీపీకే నష్టం అని వైసీపీ నేతలు అంటున్నారు దానికి కారణం ప్రభుత్వం బాగుంటే మరోసారి ఎవరైనా ఓటు వేస్తారు. బాగులేదు అనుకుంటే విపక్షం వైపు చూస్తారు. అలా విపక్షానికి వేసే ఓట్లు మొత్తం కాంగ్రెస్ లేకపోతే టీడీపీకి వస్తాయి కానీ ఇపుడు అవి కాంగ్రెస్ కే పడతాయి దాని వల్ల టీడీపీకకే నష్టం అని అంటున్నారు.

అలా చూసుకుంటే కనుక షర్మిల పోటీ చేయడం వల్ల కడపలో ఓట్లు ఎవరికి చీలుతాయి అన్నది మాత్రం ఊహకు అందడం లేదు.ప్రస్తుతం ఇక్కడ టీడీపీకే పోల్ మేనేజ్మెంట్ ఇబ్బందిగా ఉంటే ఇంకా కాంగ్రెస్ పరిస్థితి చెప్పాలసిన పనిలేదు.బూత్ లెవెల్ దాకా వెళ్ళి ఓట్లు వేయించుకోవడం అన్నది కాంగ్రెస్ కి కష్టసాధ్యమైన పని.ఒకవేళ టీడీపీ సాయం చేసినా ఆ రెండు పార్టీల ఓట్లే అటూ ఇటూ టర్న్ అవుతాయంటున్నారు. ఇకపొతే వైసీపీ వద్దు అనుకున్న ఓట్లు ఈసారి కాంగ్రెస్ కి వెళ్లినా వెళ్లవచ్చు అంటున్నారు. షర్మిల చీల్చే ఓట్లు ఎక్కువగా ఉంటాయా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: