- ఒకే నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధాన పార్టీల నుంచి ఇద్ద‌రూ మ‌హిళ‌లే పోటీ..?
- ఉమెన్ వ‌ర్సెస్ ఉమెన్ రాజ‌కీయంతో ఆస‌క్తిక‌ర పోరు


( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
రాష్ట్ర రాజ‌కీయాల్లో కొత్త ట్రెండ్ క‌నిపిస్తోంది. గ‌తానికి భిన్న‌మైన రాజ‌కీయాలు ప్ర‌స్తుతం తెర‌మీదికి వ‌చ్చా యి. మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం పెర‌గాల‌ని.. మ‌హిళ‌లు రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఉప‌న్యాసాలు ఇవ్వ‌డ‌మే కాకుండా.. ప్ర‌ధాన పార్టీలు ఆదిశ‌గా ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్నాయి. తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో మెజారిటీ పార్టీలు అన్నీ కూడా.. మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించాయి. పార్ల‌మెంటు సీట్లు, అసెంబ్లీ సీట్ల‌లో త‌గిన విధంగా మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చారు.


అయితే..ఇక్క‌డ కూడా పార్టీలు మ‌రో ప్ర‌యోగం చేయ‌డం గ‌మ‌నార్హం. అనుకుని ఇవ్వ‌క‌పోయినా.. మూడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, ఒక పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధాన పార్టీదారులుగా ఉన్న రెండు కీల‌క పార్టీల నుంచి పోటీ చేస్తున్న‌ ఇద్ద‌రు అభ్య‌ర్థులు కూడా మ‌హిళ‌లే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గంలో ఉమ‌న్ వ‌ర్సెస్ ఉమ‌న్ అన్న‌ట్టుగానే రాజ‌కీయాలు సాగుతున్నాయి. వాస్త‌వానికి ఇలాంటి ప‌రిస్థితి గ‌తంలో పెద్ద‌గా లేదు.


అంటే.. ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులుగా మ‌హిళ‌లే పోటీ చేయ‌డం అనేది చాలా చాలా అరుదుగానే సంభవించింది. 2019లో కేవ‌లం ఒకే ఒక్క నియోజ‌క‌వ‌ర్గం సింగ‌న‌మ‌ల నియోజ క‌వ‌ర్గంలో టీడీపీ, వైసీపీ త‌ర‌పున బ‌రిలో నిలిచిన రెండు పార్టీల అబ్య‌ర్థులు ఇద్ద‌రూ మ‌హిళ‌లు కావ‌డం విశేషం. వైసీపీ నుంచి జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి పోటీ చేస్తే.. ఇదే స‌మ‌యంలో టీడీపీ అభ్య‌ర్థిగా బండారు శ్రావ‌ణి పోటీ చేశారు. వీరిలో ప‌ద్మావ‌తి విజ‌యం ద‌క్కించుకున్నారు.


ఇక‌, 2014లోనూ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్ద‌రూ మ‌హిళ‌లే బ‌రిలో నిలిచారు. వైసీపీ నుంచి ప‌ద్మావ‌తి పోటీ చేస్తే.. టీడీపీ నుంచి యామినీ బాల పోటీలో ఉన్నారు. బాల గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, ఇప్ప‌టి ప‌రిస్థితి ని గ‌మ‌నిస్తే.. ఇప్పుడు ఏకంగా మూడు అసెంబ్లీ, ఒక పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ-టీడీపీ, జ‌న‌సే, బీజేపీ కూట‌మి నుంచి ఇద్ద‌రూ మ‌హిళ‌లే పోటీ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. పైగా.. ఆయా అభ్య‌ర్థులు సామాజిక వ‌ర్గాల ప‌రంగా బ‌ల‌మైన నాయ‌కులే కావ‌డం కూడా గ‌మ‌నార్హం. మ‌రి ఏ మ‌హిళ‌కు ప్ర‌జ‌లు జై కొడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: