ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ జగన్ అధికారంలోకి రావడానికి పలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రెండోసారి కూడా అధికారమే లక్ష్యంగా బస్సు యాత్ర చేపట్టి రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసినట్లు తెలుస్తోంది.. ఒకప్పుడు ప్రత్యర్థి పార్టీలైన జనసేన, టిడిపి అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరదాల వీరుడు అంటూ విపక్షాలు చేసిన విమర్శలకు తన బస్సు యాత్రతో ఒక్కసారిగా సమాధానం చెప్పేశారు వైయస్ జగన్. ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందే బస్సు యాత్రతో రాష్ట్ర రాజకీయ రూపురేఖలే మార్చేసిన ఆలోచన ఏమిటి? తాజా రాజకీయ పరిస్థితులపై ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పు ఏమిటి? అనే విషయంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.

సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.. ఇక ఈ ఎన్నికలను వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. ఇందులో భాగంగానే మేమంతా సిద్ధం యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా మార్చి వేస్తోంది.. వైసిపి అధ్యక్షుడు హోదాలో వైయస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిర్వహిస్తున్న బస్సు యాత్ర.. ప్రతిపక్షాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తామని చెప్పడంలో సందేహం లేదు. ప్రతి గ్రామం,  ప్రతి పట్టణం , ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం అంటూ ప్రతిపక్షాల నేతలు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతూ అటు టిడిపి ఇటు జనసేనకి షాక్ ఇస్తున్నారు.

బస్సు యాత్రలో భాగంగా చాలామంది వైసిపిలో చేరుతున్నారు. ముఖ్యంగా మాజీల చేరికతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ వేవ్ 2024లో స్పష్టంగా కనిపిస్తోంది.. 175 స్థానాలకు 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా వైసిపి అడుగులు వేస్తోంది.. 19 రోజుల మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా జనసేన, బీజేపీ, టిడిపి,  కాంగ్రెస్ ప్రత్యర్థ పార్టీలకు చెందిన దాదాపు 138 మంది ప్రముఖ నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీకి బహిరంగంగా మద్దతు ప్రకటించారు... అలాగే యాత్రకు ముందే మరో 83 మంది నేతలు వైసీపీలో చేరారు.. ఇక ఇలా నేతల చేరికతో ఇటీవల వైసిపిలోకి చేరిన వారి సంఖ్య 221కి చేరుకుంది. నేతల చేరికతో పాటు గత 35 రోజులలో విపక్షాలకు చెందిన ముఖ్య నాయకులు 1,05,000 మందితో పాటు క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా వైసీపీలో చేరారు. మొత్తానికి అయితే  బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డికి బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అప్పటివరకు తనతో ఉంటామన్న నాయకులు జగన్ తో చేరడంతో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్ర కవళికలు మారుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: