ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ మూడు పార్టీలను అభిమానించేవారు ఎంతో ఆనందపడ్డారు. ఎందుకు అంటే వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తూ ఉండడం ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన గుర్తింపు కలిగిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ లు కలిసి పోటీలోకి దిగనుండడంతో వీరికే గెలుపు వరిస్తుంది అని దానిలో ఎలాంటి సందేహం ఉండదు అని ఈ మూడు పార్టీలను అభిమానించే వ్యక్తులు ఎంతో ఆనందపడ్డారు.

కానీ సమస్య ఆ తర్వాతే ప్రారంభం అయ్యింది. ఒంటరిగా పోటీ చేస్తూ ఉండడంతో వైసీపీ పార్టీ సీట్ల పంపిణీ విషయంలో ఫుల్ క్లారిటీగా ఉంది. దానితో చాలా రోజుల ముందే ఈ పార్టీ క్యాండిడేట్లను సెలెక్ట్ చేసింది. దానితో వారు అక్కడి క్యాడర్ ను బలపరుచుకోవడం , ప్రచారాలను జోరుగా చేయడం ఎప్పటినుండో మొదలుపెట్టారు. ఇక కూటమి మాత్రం మొదట ఏ ప్రాంతంలో ఏ పార్టీకి సీటు ఇవ్వాలి అనే దాని కోసం కొంతకాలాయాపన చేసింది.

చివరకు ఈ మూడు పార్టీల అధినేతలు ఆ విషయంలో ఓ క్లారిటీకి వచ్చి వాటిని అనౌన్స్ చేశారు. దానితో ఇంత కాలం పాటు పార్టీలో ఉండి పార్టీ కోసం పని చేసిన వారికి ఆ సీటు రాకపోవడంతో అక్కడి నేతలలో ఆగ్రహ ఆవేశాలు భగ్గుమన్నాయి. ఇక్కడ నుండే అసలు కథ ప్రారంభం అయ్యింది. చివరికి ఎన్నో బుజ్జగింపులతో కూటమి చాలా  నియోజకవర్గాల సమస్యలను క్లియర్ చేసినప్పటికీ ఓ మూడు ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు. పొత్తులో భాగంగా వనపర్తి సీటును బీజేపీ కి ఇచ్చారు.

దానితో ఇక్కడి సీట్ బీజేపీ నేతకు వస్తుంది అని అంతా భావించారు. కానీ తాజాగా టీడీపీ నేత నల్లమిల్లిని బీజేపీ లో చేర్చుకోవాలి అనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈయనకు ఈ ప్రాంత సీటు ను ఇవ్వకండి అని ఇక్కడి బీజేపీ నాయకుల , కార్యకర్తల నుండి డిమాండ్ వస్తుంది. ఇక చిత్తూరులో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి అమర్‌ నాథ్‌ సోదరుడు శ్రీనాథ్‌ రెడ్డి, అనీషా రెడ్డి ఈ నెల 25 న సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు.

శ్రీనాథ్‌రెడ్డి దంపతుల రాకతో పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో టీడీపీపై ప్రతికూల ప్రభావం పడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక గన్నవరం సీటును టీడీపీ కి కేటాయించారు. దానితో బీజేపీ రెబల్‌ అభ్యర్థిగా కొర్రపోలు శ్రీనివాసరావు నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్డీఏ కూటమి అని చెప్పి బీజేపీ నేతలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకనే తాను గన్నవరం నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానన్నారు. ఇలా ఈ మూడు ప్రాంతాల విషయంలో కూటమి ఇప్పటికీ కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: