సుజ‌నా చౌద‌రి. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. రాజ‌కీయాల్లో వ‌చ్చిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌. కేంద్రంలో మంత్రిగా ప‌నిచేశారు. గ‌తంలో టీడీపీలో ఉన్న ఆయ‌నరెండు సార్లు రాజ్య‌స‌భ ఎంపీగా ప‌నిచేశారు. త‌ర్వాత‌.. బీజేపీలో చేరిపోయారు. ఇక‌, ఇప్పుడు అనూహ్య రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న విజ‌య‌వాడ వెస్ట్ స్తానం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. వాస్త‌వానికి విజ‌యవాడ ఎంపీగా పోటీ చేయాల‌ని అనుకున్నారు.


కానీ, పొత్తులో భాగంగా ఈ సీటును తామే తీసుకుంటామ‌ని టీడీపీ తేల్చి చెప్పింది. ఈ క్ర‌మంలో విజ‌య‌వా డ వెస్ట్ సీటును తీసుకున్న బీజేపీ దీనిని సుజనాకు ఇచ్చింది. అయితే.. ఈ క్ర‌మంలో అనేక నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇక‌, సుజ‌నా ఇప్ప‌టికే నామినేష‌న్ కూడా వేసేశారు. ప్ర‌చారాన్ని కూడా అంగ‌రంగ వైభ‌వంగా ఆయ‌న ప్రారంభించారు. భారీ ఎత్తున కేర‌ళ నుంచి తీసుకువ‌చ్చి న సంగీత క‌ళాకారుల‌తో ఇక్క‌డ ఊరేగింపు నిర్వ‌హించారు.


శాస్త్రీయ నృత్యాలు కూడా చేయించారు. అదేవిధంగా త‌ప్పెట‌గుళ్లు.. వంటి క‌ళాజాతాల‌తో ప్ర‌చారాన్ని తొలి రోజు ఇర‌గ‌దీశార‌నే చెప్పాలి. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ చ‌ప్ప‌బ‌డిపోయింది. ఎందుకంటే.. ఎండ‌ల తీవ్ర‌త‌తో ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. సాయంత్రం పూట మాత్ర‌మే ప్ర‌చారానికి ప‌రిమిత‌మ‌య్యారు. ఇక‌, వైసీపీ నుంచి మైనారిటీ నాయ‌కులు ఆసిఫ్ పోటీ చేస్తున్నారు. ఈయ‌న ప్ర‌చారంలో ఎంపీ కేశినేని నాని ఆక‌ర్ష‌ణ‌గా ఉన్నారు. వైసీపీ విధానాల‌ను ప్ర‌చారం చేయ‌డంతో పాటు.. టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.


ఇదేస‌మ‌యంలో మిలియ‌న్లు ఇక్క‌డ పోటీ చేస్తున్నార‌ని.. రేపు గెలిచిన త‌ర్వాత‌.. ఫ్లైట్ ఎక్కేస్తే.. ఆయ‌న కోసం.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చుకునే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని కేశినేని ప్ర‌చారంలో భారీగా చెబుతు న్నారు. గ‌తంలో జ‌లీల్‌ఖాన్ కుమార్తె పోటీ చేసిన‌ప్పుడు కూడా.. ఇక్క‌డే ఉంటాన‌ని చెప్పింద‌ని.. కానీ, ఓడిపోయిన త‌ర్వాత‌.. క‌నీసం పిట్ట‌కు కూడా క‌నిపించ‌కుండా.. అమెరికా పారిపోయింద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇప్పుడు సుజ‌నా ప‌రిస్థితి కూడా ఇంతేన‌ని చెబుతున్నారు. మొత్తంగా సుజ‌నా ప్ర‌చారం.. తొలి రోజు దుమ్ము రేపినా.. మ‌లిరోజు నుంచి చ‌ప్ప‌బ‌డింద‌నేది పార్టీ వ‌ర్గాల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: