ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు విశ్వాసం ఉన్నది.. ముఖ్యంగా ఆయన మాట ఇస్తే నిలబడే తత్వం కలదని ఇప్పటికి ఎన్నోసార్లు రుజువు చేసుకున్నారు. ఇదంతా ఇలా ఉంటే గత కొన్నేళ్లుగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణం కాబోతోందని విషయం వినిపిస్తూనే ఉంది. ఈ విషయం పైన సీఎం జగన్ విశాఖలో రెండు రోజులపాటు బస చేసిన జగన్ కు విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి ఎంతోమంది తనను కలవడం జరిగిందట. దీంతో సీఎం జగన్ అక్కడ ఉన్న ప్రజలకు , అందులో పనిచేసే ఉద్యోగస్తులకు ఉక్కు పరిశ్రమ పోరాట సమితి నాయకులకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.



ముఖ్యంగా విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటుకరణం చేయమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ విషయం మీద తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించామంటూ తెలియజేశారు. అలాగే విశాఖ ఉక్కునీ ప్రైవేటీకరణం చేయకుండా లాభార్జన చేసే విధంగా కీలకమైన సూచనలతో మోదీ గారికి లేఖ రాశామంటూ కూడా తెలియజేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటుకరణం కాకుండా ఉండడమే తమకు పార్టీ మొదటి నుంచి చేస్తోంది అంటూ జగన్ వివరించారు.


ఈసారి కేంద్రంలో కచ్చితంగా బిజెపి పార్టీకి మెజార్టీ సీట్లు రాకపోతే కచ్చితంగా వైసీపీ పార్టీ మద్దతు అవసరం పడుతుంది ఆ సమయంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతామంటూ అక్కడ వారందరికీ జగన్ హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిధిలో ఉంటే గాజువాక నియోజవర్గంలో వైసిపి పార్టీని గెలిపిస్తే అందరి నేతలకు చెక్ పెట్టాలని కూడా జగన్ కోరారు ..అంతేకాకుండా ఒకవేళ ఇక్కడ కూటమి గెలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కి అక్కడి ప్రజలు కార్మికులు కూడా సానుకూలంగానే ఉండే సంకేతాలు అవుతాయని కూడా జగన్ వారిని హెచ్చరించారు. అందుకే తమ పార్టీని గెలిపించాలని తెలియజేశారట.


దీంతో అక్కడ ప్రజలు స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా కూటమికంటే వైసీపీని ఎక్కువగా నమ్ముతున్నారు. ముఖ్యంగా జగన్ గతంలో ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకున్నారని ఇప్పుడు విశాఖ ప్లాంట్ ను కూడా కాపాడుకునే విషయంలో కచ్చితంగా వైసీపీ మంచి చేస్తుందని అక్కడ ప్రజలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: