దేశ రాజకీయాలు వేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. ఏపీలో ఎక్కువగా కులానికి సంబంధించిన రాజకీయాలే జరుగుతూ ఉంటాయి.  గతంలో జరిగిన ఎన్నికల్లో ఎక్కువగా కమ్మ, కాపు నాయకుల మధ్య  రాజకీయాలు జరిగాయి. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం కాపు, కమ్మ అనే స్ట్రాటజీ పని చేయడం లేదని తెలుస్తోంది.  చాలామంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా బరిలో ఉన్నారు. దీంతో  రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఈ  ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ  మొత్తం 175 నియోజకవర్గాలు 25 పార్లమెంటు స్థానాలలో అసలు సిసలైన అభ్యర్థులను బరిలో దింపింది. ఇక వారికి ధీటుగా టీడీపీ కూటమి కూడా  ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేసింది. 

దీంతో ప్రతి నియోజకవర్గంలో  నువ్వా నేనా అనే విధంగా గట్టి పోటీ ఏర్పడింది. ఇదే తరుణంలో ఎవరి స్ట్రాటజీతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు.  టిడిపి వాళ్లు వైసిపి ప్రభుత్వంలో విఫలమైనటు వంటి పనులను వివరిస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు.వైసిపి వాళ్లు వారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పనులను వివరిస్తూ దూసుకుపోతున్నారు. అయితే వైసీపీకి కొన్నిచోట్ల  తీవ్రమైన వ్యతిరేకత వస్తుందట. కొన్ని ఊర్లలో ప్రజలు కూడా వారిని అడ్డగిస్తున్నారట. అయితే తాజాగా  వైసిపి అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డిని అడ్డగించి ఉదయగిరి వెళ్లే రోడ్డు ఎంత అద్వానంగా ఉందని ప్రశ్నించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా బాగు చేయాలనిపించలేదా, మా సమస్య మీరు పట్టించుకోనప్పుడు మళ్ళీ ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఎలా వచ్చారని కడిగిపారేశారు.

 నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పోలురెడ్డిపల్లి గ్రామస్తులు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి తేల్చి చెప్పేశారు. అలాగే సోమవారం రాత్రి చిన్న మాచనూరు పంచాయతీ పోలురెడ్డిపల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వెళ్తే  అక్కడ కూడా మేకపాటి కి తీవ్రంగా నిరసన ఎదురైందట.  అలాగే కదిరినేనిపల్లి గ్రామానికి వెళ్ళగానే  రోడ్లు బాగా లేవు, ఇండ్లు రాలేదు, మంచినీరు సమస్య విపరీతంగా ఉంది, భూ పంపిణీ చేయలేదని వారు కూడా ప్రశ్నించారు. ఈ విధంగా వైసిపి  అభ్యర్థులు  ఎక్కడికి వెళ్లినా  జరగని అభివృద్ధి పని గురించి ప్రజలు ప్రశ్నిస్తూనే ఉన్నారు.  మరి ఈ వ్యతిరేకతను టిడిపి కూటమి ఏ విధంగా వారి వైపు మలుచుకుంటుందో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: