ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతున్నది ఏమిటంటే వైసిపి మేనిఫెస్టో.. ఇప్పుడు అంతా ఎక్కువగా ఈ విషయం మీదే చర్చ జరుగుతోంది. సిద్ధం సభ అయిపోయిన వెంటనే మళ్ళీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదలుపెట్టి  ముగింపు దశకి చేరుకున్నది.. ఈనెల 22న మేనిఫెస్టో పైన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైనట్టుగా తెలుస్తోంది.అలాగే ఈ నెలాఖరిలోపు వైసీపీ పార్టీ మేనిపోస్ట్ విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.ఈ నేపథ్యంలోనే మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఈ రోజున 2000 మంది వైసీపీ సోషల్ మీడియా యాక్టీవ్లతో సీఎం జగన్ కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా వారి అభిప్రాయాలను తీసుకునేందుకు కూడా పలు ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా జగనన్న రుణమాఫీ ప్రకటిస్తే 175 కు 175 సీట్లు మనవి అనే విధంగా తెలియజేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా ఈ విషయం పైన ఎక్కువగా తెలియజేయడంతో జగన్ కేవలం నవ్వుతూ విన్నారు.. అయితే ఈ విషయం పైన మాత్రం స్పందించలేదు. ఒకవేళ జగన్ రుణమాఫీ చెబితే ఎలాంటి డౌట్ లేకుండా 175 స్థానాలు గెలుస్తారని చెప్పవచ్చుకనీసం లక్ష రూపాయలైనా రుణమాఫీ ప్రకటించాలని వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వైసీపీ అధినేత జగన్ పైన చాలా ఒత్తిడి తెస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకపోవడంతో అలాగే ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా సక్రమంగా చేయలేకపోవడంతో విఫలమయ్యారు. ముఖ్యంగా చంద్రబాబు చెప్పినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా స్పష్టత లేదు.. మరి ఈ నేపథ్యంలోని వైసీపీ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ పైన ఎలాంటి ప్రకటన చేస్తారో అంటూ చాలామంది ఎదురుచూస్తున్నారు. కేవలం ఒక్క రుణమాఫీ ప్రకటన ఇస్తే చాలు ఇక ఆంధ్రాలో మరొకసారి వైసిపి పార్టీ జెండా ఎగరడం ఖాయమని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: