పలమనేరు టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి అనీషా రెడ్డి రాజకీయ ప్రయాణం చాలా క్లిష్టంగా కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. అనీషా రెడ్డి ఉమ్మడి కడప జిల్లా రాయచోటికి చెందినవారు. ఆమె రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనీషా రెడ్డి పోటీ చేశారు. దురదృష్టవశాత్తు ఆమె ఎన్నికల్లో ఓడిపోయారు.ఓటమి తర్వాత, అనీషా రెడ్డిని పార్టీ ఇన్‌చార్జి పదవి నుండి తొలగించారు. ఈ నిర్ణయం ఆమెకు మనస్తాపం కలిగించింది. 

అనీషా రెడ్డి పార్టీలో కొనసాగడాన్ని మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి సమర్థించలేదు. రెండు చోట్లా టీడీపీని బలోపేతం చేసేందుకు పలమనేరు ఇంచార్జ్‌గా అనీషారెడ్డిని, పుంగనూరు ఇంచార్జ్‌గా అమర్‌నాథ్‌రెడ్డిని నియమించడంపై చర్చలు జరిగాయి. అయితే ఈ ఏర్పాటును అమర్‌నాథ్ రెడ్డి వ్యతిరేకించారు. దీనివల్ల హనీషా రెడ్డి రాజకీయంగా చాలా ఇబ్బంది పడ్డారు. సొంత బావ తనను రాజకీయాల్లో ఎదగకుండా తొక్కేస్తున్నారని ఆమె పగ పెంచుకుంది. ఆ పగ తీర్చుకునేందుకు జగన్ సమక్షంలో ఏప్రిల్ 25న వైసీపీలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆమెలోని అసంతృప్తిని వైసీపీ నేతలు ఆల్రెడీ పసిగట్టేశారు.  

మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అనీషా రెడ్డితో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఆమెకు తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారట. అనీషా రెడ్డి, ఆమె భర్త శ్రీనాథ్ రెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరి ఎత్తుగడ పలమనేరు, పుంగనూరు రెండింటిలోనూ అధికార పార్టీకి మేలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పలమనేరులో అనీషా రెడ్డి మారడం వల్ల అమర్‌నాథ్‌రెడ్డికి ఓటమి తప్పదనే ఆందోళన నెలకొంది.అనీషా రెడ్డికి అమర్‌నాథ్‌రెడ్డి బావ వరుస అవుతారు. అందువల్ల బావను ఓడించడానికి మరదలు వైసీపీలోకి వెళ్లిపోతున్నారని సరదాగా రాజకీయ వర్గాల్లో ప్రచారం మొదలైంది. మరి మరదలు బావని ఓడ గోడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: