ఉత్తరాంధ్ర: ఉత్తరాంధ్ర జిల్లాల్లో గెలిస్తే ఇక తిరుగుండదు. అందుకే ఉత్తరాంధ్ర జిల్లాల పై జగన్ ఫుల్ ఫోకస్ పెట్టారు. ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాగైనా గెలవాలని జగన్ మోహన్ రెడ్డి చాలా కసితో ఉన్నారు. అక్కడ వైసీపీ కుటుంబ పోరును సీఎం జ‌గ‌న్ ఆపేసారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం సాధించి తీరాల‌ని క‌సితో ఉన్న సీఎం జ‌గ‌న్‌.. ఇక్క‌డ త‌లెత్తిన భార్యాభ‌ర్త‌ల వివాదాన్ని త‌న‌దైన శైలిలో ప‌రిష్క‌రించారు. టెక్కలి నుంచి టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈయ‌న‌ను ఓడించి తీరాల‌నేది సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి పంతం. ఈ క్ర‌మంలోనే ఫైర్ బ్రాండ్ నాయ‌కుడైన దువ్వాడ శ్రీనివాస్‌కు ఆరు మాసాల ముందే.. టికెట్ ని ప్ర‌క‌టించారు. కానీ, ఏమైందో ఏమో కానీ.. జెడ్పీ మెంబ‌ర్‌గా ఉన్న శ్రీనివాస్ భార్య‌.. వాణికి త‌ర్వాత‌..టికెట్ ఇస్తామ‌ని చెప్పారు.దీంతో వాణి పేరు దాదాపు ఒక ద‌శ‌లో కన్ఫర్మ్ అయిపోయింది . జ‌గ‌న్ మోహన్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌తో ఆమె ప్రచారానికి కూడా రెడీ అయిపోయారు. తీరా ఎన్నిక‌ల వేళ‌కు వ‌చ్చేస‌రికి మ‌ళ్లీ జ‌గ‌న్ మళ్ళీ మ‌న‌సు మార్చుకుని దువ్వాడ శ్రీనివాస్‌వైపే మొగ్గు చూపారు. కానీ, వాణి మాత్రం పోటీ నుంచి ఏమాత్రం త‌ప్పుకొనేది లేద‌ని తేల్చి చెప్పారు. త‌న భ‌ర్త అయినా.. స‌రే.. వెన‌క్కి త‌గ్గే ప్రసక్తే లేద‌న్నారు. ఆ వెంట‌నే ఇండిపెండెంట్‌గా కూడా నామినేష‌న్  వేసేశారు. మ‌రోవైపు దువ్వాడ శ్రీనివాస్‌ను జ‌గ‌న్ మోహన్ రెడ్డి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు.


దీంతో భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ ప‌డ‌డంతో వైసీపీ ఓట్లు చెదిరి పోవ‌డం ఖాయ‌మ‌ని భావించిన వైసీపీ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది.తాజాగా విశాఖ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి.. ఇద్ద‌రినీ అక్క‌డ‌కు పిలుపించుకుని మరీ స‌ర్ది చెప్పారు. ముందు వాణి.. సీఎం జ‌గ‌న్‌కు  ఎదురు తిరిగార‌ని స‌మాచారం. తన‌పేరును ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. వెన‌క్కి ఎలా తీసుకుంటార‌ని.. ఇది మంచిది కాద‌ని కూడా ఆమె వాదించిందట. అయితే.. సీఎం జ‌గ‌న్ ఆమెను కూల్ చేసి మ‌నం ఒక ల‌క్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్నామ‌ని.. అచ్చెన్న‌ను ఖచ్చితంగా ఓడించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని.. ఇప్పుడు పంతాలు ప‌ట్టింపుల‌కు పోయే స‌మ‌యం కాద‌ని జగన్ న‌చ్చ‌జెప్పారు. అయినా కానీ వాణి మాట విన‌లేదు.దీంతో అరగంట పాటు టైం ఇచ్చిన జ‌గ‌న్ త‌ర్వాత‌.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌ను గెలిపించేందుకు ఖచ్చితంగా కృషి చేయాల‌ని..ఇక ఆయ‌న గెలిచిన త‌ర్వాత‌.. ఆయ‌న ఎమ్మెల్సీ సీటును మీకు ఇస్తామ‌ని వాణికి బ‌ల‌మైన హామీ ఇచ్చాడటా. దీంతో వాణి సల్ల బడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: