- పార్టీ మారి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ద‌క్కించుకున్న వేమిరెడ్డి దంప‌తులు
- జంపింగ్ నేత‌ల్లో రెండు సీట్లు ద‌క్కించుకున్న ఫ్యామిలీగా రికార్డ్‌

( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )

వాళ్లు నిన్నటి వరకు వైసీపీలో కీలకంగా ఉన్నారు.. ఆ నేతకు రాజ్యసభ పదవి ఉంది. పార్టీ అధినేత జగన్ దగ్గర కూడా ఎంతో ప్రయారిటీ ఉంది. ఎక్కడో లెక్క తేడా కొట్టింది.. ఆ నేత‌ ఈగో హర్ట్ అయింది చాలు.. వెంటనే పార్టీ మారిపోయారు.. ఇలా పార్టీ మారారో లేదో వెంటనే చంద్రబాబు ఆయనకు ఎంపీ టిక్కెట్లు.. ఆయన భార్యకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చేశారు. ఆ భార్యాభర్తలు ఎవరో ? కాదు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక‌ వేత్త‌ టిడిపి నుంచి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. పారిశ్రామికవేత్తగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ముందుగా వైసిపి తో ప్రారంభం అయింది. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.


వైసీపీకి భారీగా ఆర్థిక సహాయం చేయడం వల్ల ఆయనకు జగన్ రాజ్యసభ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. తాజా ఎన్నికల్లోను జగన్ ఆయనకు నెల్లూరు పార్లమెంటు సీటు కేటాయించారు. అయితే తన పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో వేమిరెడ్డి తీవ్రంగా విభేదించారు. ఈ క్రమంలోనే జగన్ సైతం వేమిరెడ్డి మాటను పట్టించుకోలేదు. వెంటనే తెలుగుదేశం కండువా కప్పుకున్న ఆయనకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. వేమిరెడ్డికి నెల్లూరు పార్లమెంటు సీటు తో పాటు ఆయన భార్య ప్రశాంత్ రెడ్డికి కొవ్వూరు అసెంబ్లీ సీటు ఇచ్చారు.


ఇలా పార్టీ మారిన వెంటనే భార్యాభర్తలు ఇద్దరు ఎంపీ , ఎమ్మెల్యే సీట్లు దక్కించుకున్నారు. తాజా ఎన్నికలలో పార్టీ మారిన నేతలు అందరిలోనూ ఈ భార్యాభర్తలు అంత అదృష్టవంతులు ఎవరు ?ఉండరనే చెప్పాలి. మ‌రి ఎంపీ , ఎమ్మెల్యేలుగా పార్టీలు మారి పోటీ చేస్తోన్న ఈ ఇద్ద‌రు నేత‌ల భ‌విత‌వ్యం ఎలా ఉంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: