ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ అంటే కచ్చితంగా ప్రతి ఒక్కరికి తెల్లదొరలను గడగడలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే పేరు గుర్తుకొస్తుంది. ముఖ్యంగా ఆయన జన్మించిన బనగానపల్లి ఎన్ని తరాలు మారినప్పటికీ ఎన్ని రాజ్యాలు మారిన ఇప్పటికీ అదే పౌరుషం అదే పంతంతోనే అక్కడ కనిపిస్తూ ఉంటుంది.. ముఖ్యంగా ఎన్నికలు సైతం ఎప్పుడు రసవత్తంగానే ఉంటాయి. గత ఎన్నికలలో బనగానపల్లి లో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఈసారి ఎన్నికలు అక్కడ హోరాహోరీగా సాగనున్నాయి. టిడిపి అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి.. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది తన అస్త్రాలను సంధిస్తూ ముందుకు వెళుతున్నారు.ముఖ్యంగా బనగానపల్లిలో ప్రత్యర్థుల కోటలను సైతం బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యారు. దీంతో వైసిపి అభ్యర్థి కాటసాని రామిరెడ్డి లో ఓటమి భయం మొదలయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి కచ్చితంగా అరుంధతి కోట పైన టిడిపి జెండా ఎగరేస్తారంటూ కూడా తెలియజేస్తున్నారు. గత ఎన్నికలలో జగన్ వేవ్ తో నెట్టుకొచ్చిన కాటసాని రామిరెడ్డి స్వల్ప మెజారిటీతోనే అక్కడ గెలిచారు. ఓటమిపాలైన టిడిపి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి మాత్రం నిత్యం ప్రజలలో ఉంటూ పలు రకాల సేవ కార్యక్రమాలను చేపడుతున్నారట. దీంతో చాలామంది వైసిపి నాయకులు కూడా టిడిపి పార్టీలోకి చేరడంతో అక్కడ కోలుకోలేని దెబ్బ పడినట్టుగా కనిపిస్తోంది.


 గ్రౌండ్ వర్క్ తోనే బీసీ జనార్దన్ రెడ్డి పనిచేసుకుంటూ ప్రజలలో మంచి ఆదరణ పొందుతున్నారు. వైసిపి అభ్యర్థి కాటసాని రామిరెడ్డి సొంత గ్రామంలోని జనార్దన్ రెడ్డి పాగా వేసినట్టుగా కనిపిస్తోంది. గత 20 ఏళ్లుగా కాటసాని రామిరెడ్డి కి నమ్మిన బంటుగా ఉన్న ముఖ్య నేతలను కూడా టిడిపిలోకి చేర్చుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాటసాని రామిరెడ్డి వ్యవహారంతో పాటు ఆయన కుమారుడు ఓబుల్ రెడ్డి పెత్తనం వల్ల అనుచరులు భరించలేక సొంత గ్రామంలోని వైసీపీ పార్టీ నుంచి టిడిపి పార్టీలోకి చేరడంతో పాటు ఈసారి కచ్చితంగా జనార్దన్ రెడ్డి గెలుపు ఖాయం అనే విధంగా తెలియజేస్తున్నారు. ఈసారి బనగానపల్లి కోట పైన కచ్చితంగా పసుపు జెండా ఎగరడం ఖాయమని అక్కడ తెలుగు తమ్ముళ్లు ధీమాని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: