పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయినా ఆయన రాజకీయాలను పూర్తిస్థాయిలో వంటబట్టించుకోలేదనే సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్లు పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగిస్తున్నాయి. కేసీఆర్ ను చూసి పవన్ కళ్యాణ్ చాలా పాఠాలను నేర్చుకోవాలని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు.
 
పవన్ కళ్యాణ్ ను ఒకప్పుడు టీడీపీ అనుకూల మీడియా టార్గెట్ చేసేది. వైసీపీ మీడియా పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత ఇచ్చేది కాదు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా తన భావాలను పంచుకోవడం జరిగింది. సోషల్ మీడియా ద్వారానే వీలైనంత పాపులారిటీని పెంచుకోవడం జరిగింది. ప్రస్తుతం టీడీపీ అనుకూల మీడియా మద్దతు పవన్ కళ్యాణ్ కు ఉంది. అయితే ప్రజలతో మమేకమై ప్రజ మెప్పును పొందే విషయంలో ఫెయిల్ అవుతున్నాయి.
 
కేసీఆర్ తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి 4 గంటల పాటు టైమ్ కేటాయించి ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం ఇచ్చారు. పార్టీ పేరును సైతం మార్చే అవకాశం లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ పార్టీ గెలిచినా ఓడినా ఆయనలో పెద్దగా మార్పు రాలేదు. పవన్ మాత్రం అపనమ్మకంతోనే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. పాయింట్ బ్లాంక్ జవాబులతో మెప్పించే విషయంలో పవన్ కళ్యాణ్ ఫెయిలవుతున్నారు.
 
జగన్ తో శత్రుత్వం ఎందుకు ? జగన్ వల్ల ఏపీ ప్రజలకు ఏమైనా నష్టం కలిగిందా? చంద్రబాబును విమర్శించి మళ్లీ సమర్థించడానికి కారణాలేంటి? అనే ప్రశ్నలకు సరైన జవాబులను చెబితే పార్టీకి బెనిఫిట్ కలుగుతుంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకో ఆ దిశగా అడుగులు అయితే వేయడం లేదని తెలుస్తోంది. జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే పవన్ ఎలా సీఎం అవుతారని ఆయన ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: