తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్, నారా లోకేష్ ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇద్దరూ ఐటీ మినిస్టర్లుగా పని చేశారు. ఇక ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా తనదైన మార్కు చూపించేందుకు ఆయన పాదయాత్ర కూడా చేశారు. పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. తన వద్ద అక్రమార్కుల పేర్లను రాసిన రెడ్ బుక్‌ ఉందంటూ వార్నింగ్స్ పంపుతున్నారు. ఇక ఏపీలో నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. అయితే ఇప్పటికే మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. 

ఆయన తరుపున ఆయన భార్య బ్రాహ్మణి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన కొద్ది తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన తన నామినేషన్ పత్రాల్లో దాఖలు చేసిన ఆస్తుల విలువ అందరినీ ఆకర్షిస్తోంది. ఆయన ఆస్తులను కొందరు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆస్తులతో పోలుస్తున్నారు. ఇద్దరి ఆస్తులను పోలిస్తే ఎవరి వద్ద ఎక్కువ ఉన్నాయో తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.


ఎన్నికల నామినేషన్ పత్రాల్లో నారా లోకేష్ తన ఆస్తుల విలువ దాదాపు రూ.542.7 కోట్లుగా ప్రకటించారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి ఎం, లావణ్య ఆయనపై పోటీ చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తన కుటుంబ ఆస్తులుగా రూ.373.63 కోట్లుగా ప్రకటించారు. తన కుటుంబానికి చెందిన ₹339.11 కోట్ల విలువైన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌లో కోటి రూపాయలకు పైగా షేర్లను ఒక్కొక్కటి రూ.337.85 చొప్పున కలిగి ఉన్నారు. ఆయన భార్య నారా బ్రాహ్మణి ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అఫిడవిట్ ప్రకారం,  లోకేష్ రూ.314.68 కోట్ల విలువైన చరాస్తులు, రూ.92.31 కోట్ల విలువైన స్థిరాస్తులను కలిగి ఉన్నారు. ఆయన భార్య బ్రాహ్మణి పేరుతో రూ.45.06 కోట్ల స్థిరాస్తులు, రూ.35.59 కోట్ల చర ఆస్తులను కలిగి ఉన్నారు. అయితే ఇటీవల ఎన్నికల సమయంలో కేటీఆర్ తెలంగాణలో నామినేషన్ సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఇలా ఆస్తులు కలిగి ఉన్నారు. కేటీఆర్-శైలిమ దంపతుల పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.51 కోట్లు. కేటీఆర్ వద్ద కంటే ఆయన భార్య శైలిమ వద్దే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. కేటీఆర్ వద్ద రూ.6.92 కోట్ల చరాస్తులు ఉన్నాయి. బ్యాంకు ఖాతాల్లో నగదు, డిపాజిట్లు, టీ న్యూస్ ఛానల్‌లో పెట్టుబడులు, బంగారం వంటివి ఇందులో ఉన్నాయి. ఇక రూ.17.83 కోట్ల విలువైన స్థిర ఆస్తులు ఉన్నాయి. అంతేకాకుండా ఆయనకు రూ.11.89 కోట్ల అప్పులు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: