క‌ళ్యాణ‌దుర్గం... ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని కీల‌క‌మైన శాస‌నసభ స్థానం. 2014లో ఇక్క‌డ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా.. ప్ర‌స్తుత మంత్రి ఉష శ్రీచ‌ర‌ణ్ విజ‌యం సాధించారు.  ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. ఇక్క‌డ బ‌ల‌మైన అభ్య‌ర్థులే బ‌రిలో ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వైసీపీ నుంచి అనంత‌పురం ఎంపీగా ప‌నిచేసిన త‌లారి రంగ‌య్య ప్ర‌స్తుతం పోటీలో ఉన్నారు. ఈయ‌న బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు.

టీడీపీ నుంచి ప్ర‌ముఖ కాంట్రాక్ట‌ర్ క‌మ్మ‌సామాజిక వ‌ర్గానికి చెందిన అమిలినేని సురేంద్ర‌బాబు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పి. రాంభూపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్సెస్ టీడీపీ అభ్య‌ర్థుల మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ జ‌ర‌గ‌నుంది.  అయితే.. వైసీపీ అభ్య‌ర్తి రంగ‌య్య‌ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, జ‌గ‌న్‌పైనే ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌చారంలోనూ ఆయ‌న ఇదే విష‌యం చెబుతున్నారు. బ‌రిలో ఉన్న‌ది నేను కాదు.. జ‌గ‌నే అని చెబుతున్నారు.  

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌యోగం చేసింది. పార్టీ త‌ర‌ఫున ఉన్న సీనియ‌ర్ నాయ‌కులు.. ఉమామ‌హేశ్వ‌ర‌నాయుడు, ఉన్నం హ‌నుమంత‌రాయ చౌద‌రిల‌ను పక్క‌న పెట్టి.. ప్ర‌ముఖ కాంట్రాక్ట‌ర్‌గా ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన అమిలినేని సురేంద్ర బాబును నిల‌బెట్టారు. ఈయ‌న ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం.. నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు ఉండ‌డం.. నియోజ‌క‌వ‌ర్గంలో కొన్ని ద‌శాబ్దాలుగా.. ప‌నిచేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ఆక‌ళింపు చేసుకున్నారు.

క‌ళ్యాణ‌దుర్గంలో త‌ల‌ప‌డుతున్న నాయ‌కుల ఆర్థిక‌ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. టీడీపీ నుంచి బ‌రిలో ఉన్న అమ‌లినేని సురేంద్రబాబు ముందున్నారు. ఆర్థికంగా ఆయ‌న బ‌లంగా ఉండ‌డంతో ప్ర‌జ‌ల‌కు క‌ళ్యాణ‌దుర్గం... ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని కీల‌క‌మైన శాస‌నసభ స్థానం. 2014లో ఇక్క‌డ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా.. ప్ర‌స్తుత మంత్రి ఉష శ్రీచ‌ర‌ణ్ విజ‌యం సాధించారు.  ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. ఇక్క‌డ బ‌ల‌మైన అభ్య‌ర్థులే బ‌రిలో ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వైసీపీ నుంచి అనంత‌పురం ఎంపీగా ప‌నిచేసిన త‌లారి రంగ‌య్య ప్ర‌స్తుతం పోటీలో ఉన్నారు. ఈయ‌న బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు.

టీడీపీ నుంచి ప్ర‌ముఖ కాంట్రాక్ట‌ర్ క‌మ్మ‌సామాజిక వ‌ర్గానికి చెందిన అమిలినేని సురేంద్ర‌బాబు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పి. రాంభూపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్సెస్ టీడీపీ అభ్య‌ర్థుల మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ జ‌ర‌గ‌నుంది.  అయితే.. వైసీపీ అభ్య‌ర్తి రంగ‌య్య‌ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, జ‌గ‌న్‌పైనే ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌చారంలోనూ ఆయ‌న ఇదే విష‌యం చెబుతున్నారు. బ‌రిలో ఉన్న‌ది నేను కాదు.. జ‌గ‌నే అని చెబుతున్నారు.  

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌యోగం చేసింది. పార్టీ త‌ర‌ఫున ఉన్న సీనియ‌ర్ నాయ‌కులు.. ఉమామ‌హేశ్వ‌ర‌నాయుడు, ఉన్నం హ‌నుమంత‌రాయ చౌద‌రిల‌ను పక్క‌న పెట్టి.. ప్ర‌ముఖ కాంట్రాక్ట‌ర్‌గా ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన అమిలినేని సురేంద్ర బాబును నిల‌బెట్టారు. ఈయ‌న ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం.. నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు ఉండ‌డం.. నియోజ‌క‌వ‌ర్గంలో కొన్ని ద‌శాబ్దాలుగా.. ప‌నిచేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ఆక‌ళింపు చేసుకున్నారు.

క‌ళ్యాణ‌దుర్గంలో త‌ల‌ప‌డుతున్న నాయ‌కుల ఆర్థిక‌ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. టీడీపీ నుంచి బ‌రిలో ఉన్న అమ‌లినేని సురేంద్రబాబు ముందున్నారు. ఆర్థికంగా ఆయ‌న బ‌లంగా ఉండ‌డంతో ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలో ప్ర‌భుత్వాల‌పై ఆధార‌ప‌డే ప‌రిస్థితి త‌క్కువ‌నేగా ఉంటుంది. ఇక‌, వైసీపీ నుంచి బ‌రిలో ఉన్న ఎంపీ రంగ‌య్య ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. తాజాగా ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో మొత్తం ఆస్తుల‌ను 2 కోట్ల రూపాయ‌ల లోపే చూపించారు.  రెండు ప్ర‌ధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న ఇద్ద‌రు నేత‌లు కూడా.. క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. దీంతో ఇద్ద‌రూ కూడా.. గ‌ట్టిగానే గెలుపు కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  దీంతో హోరా హోరీ పోరు ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.సేవ చేయ‌డంలో ప్ర‌భుత్వాల‌పై ఆధార‌ప‌డే ప‌రిస్థితి త‌క్కువ‌నేగా ఉంటుంది. ఇక‌, వైసీపీ నుంచి బ‌రిలో ఉన్న ఎంపీ రంగ‌య్య ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. తాజాగా ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో మొత్తం ఆస్తుల‌ను 2 కోట్ల రూపాయ‌ల లోపే చూపించారు.  రెండు ప్ర‌ధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న ఇద్ద‌రు నేత‌లు కూడా.. క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. దీంతో ఇద్ద‌రూ కూడా.. గ‌ట్టిగానే గెలుపు కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  దీంతో హోరా హోరీ పోరు ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: