ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై "సిద్ధం" సభలకు ముందు దాకా కూడా కాస్త మిక్స్డ్ అనాలసిస్ లు, మిక్స్డ్ సర్వే ఫలితాలు, మిక్స్డ్ చర్చలు జరుగుతుండేవి కానీ... ఎప్పుడైతే "సిద్ధం" అంటూ జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తలతో బహిరంగ సభలు నిర్వహించి రాయితో కొట్టించుకున్నారో నాటి నుంచి లెక్కలు మారడం మొదలైందని తెలుస్తుంది. ఇదే సమయంలో... "మేమంతా సిద్ధం" అంటూ బస్సుయాత్రతో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజలతో మమేకమవ్వుతూ తిరగడం వైసీపీ వారికి మరింత ప్లస్ అయ్యింది.అందువల్లే ఈ సంవత్సరం ప్రారంభంలోని సర్వేల ఫలితాలు, విశ్లేషకుల అభిప్రాయాలు ఒకలా ఉంటే... అభ్యర్థుల ప్రకటన, సిద్ధం యాత్రలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర సమయంలో సర్వే ఫలితాలతో పాటు, విశ్లేషకుల అభిప్రాయాలు, ప్రజల మనసుల్లో ఉన్న అభిప్రాయాలు స్పష్టంగా తెరపైకి వచ్చయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. పైగా ఉత్తరాంధ్రలో వైసీపీకి ప్రజాదరణ కూడా పెరుగుతుంది.దీంతో వైసీపీ అభ్యర్థుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చింది.పైగా... ఈ సిద్ధం సభలతో పాటు.. మేమంతా సిద్ధం బస్సు యాత్రల్లో కూడా సీఎం జగన్ ప్రజలకు చెప్పాలనుకున్న విషయాన్ని వీలైనంత సూటిగా, స్పష్టంగా చెప్పారనే చర్చ ఇప్పుడు వచ్చింది.


ఇందులో ప్రధానంగా... ఈ ప్రభుత్వ హయాంలో మీకు, మీ ఇంటికీ మేలు జరిగితేనే వైసీపీ ఓటు వేయండి అనేది ఒకటి కాగా... 2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీలో ఎన్ని హామీలు నెరవేరాయో, నాడు వారు చెప్పిన మాటల్లో ఎన్ని జరిగాయో ఒక్కసారి ఆలోచించాలని  వైసీపీ వారు కోరుతున్నారు.దీంతో... సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పలచబడింది. పైగా పవన్ కల్యాణ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వర్గం.. ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన వ్యాఖ్యలతో తీవ్ర అసంతృప్తిగా ఉందని తెలుస్తుంది. కష్టపడి పార్టీకి పనిచేసిన తమకు కాకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వలస పక్షులకు టిక్కెట్లు ఇచ్చారనే ఆవేదన, ఆక్రోశం బీజేపీ కేడర్ లో బలంగా ఉన్నట్లు తెలుస్తుంది.అలాగే ఇదే కూటమి వల్ల టిక్కెట్లు పోగొట్టుకున్న టీడీపీ నేతలతో పాటు.. టిక్కెట్ ఇస్తానని చెప్పి చివర్లో ఎగ్గొట్టబడినవారు కూడా టీడీపీపై దుమ్మెత్తి పోస్తున్నారు . ఇన్ని  సమస్యల మధ్య టీడీపీ నేతల్లో కాన్ ఫిడెన్స్ లెవల్స్ తగ్గుతున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది. మరి చూడాలి చివరకి ఏమవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: