ఆంధ్రప్రదేశ్లో డిబిటిల పంపిణీ లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది.గడిచిన 59 నెలలుగా లబ్ధి పొందుతున్నటువంటి ఏపీ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ తీసుకువచ్చింది.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విద్యార్థులు మహిళలు వేసిన ఒక పిటిషన్ పైన సానుకూలంగానే స్పందిస్తూ కోర్టు సైతం తీర్పుని వెలుపరిచింది.. ముఖ్యంగా వైసిపి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సంక్షేమ పీఠం వేశారు. ఈ క్రమంలోనే అర్హత కలిగిన ప్రజల అందరికీ కూడా ఏదో ఒక పథకం రూపంలో డిబిటి ద్వారా బటన్ నొక్కి మరి తమ ఖాతాలలో డబ్బులు వేస్తున్నారు.


అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రభుత్వ పథకాలను సైతం లబ్ధి పొందకూడదని ఈసీ అధికారులు పలు రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశారు.. పోలింగ్ తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలని కూడా ఈ విషయంలో కోరగా.. ఎలక్షన్ ముందు ఇలాంటి పని చేస్తే ఓటర్లు ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉందని కూడా వెల్లడించారు.. దీనిపైన ఈసీ డిబిటి ద్వారా నిధులను నిలిపివేయాలంటూ పలు రాజకీయ పార్టీలు అధికారులకు ఫిర్యాదు చేశాయి. ఈ విషయం పైన వైఎస్ఆర్సిపి అనుమతి కోరుతూ అందజేసిన ఒక లేఖ పైన ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు జాప్యం చేశారు.


ఇలాంటి సమయంలోనే వైఎస్ఆర్సిపి నేతలు ఈసీకి విచారణ కోరారు.. గత నాలుగేళ్లగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తూనే ఉన్నామని ఇప్పటివరకు తీసుకువచ్చిన పథకం కాదని కూడా వివరించారు.. పైగా 58 నెలల్లో ప్రలోబాలకు  గురి కాని వారు కేవలం ఒక్కసారి మాత్రమే ఎలా ప్రలోభాలకు గురవుతారు అంటూ కూడా ప్రశ్నించారు. దీంతో ఈసీ అధికారులకు ఎలాంటి ఆదేశాలు పంపకపోవడంతో కొంతమంది విద్యార్థులు, మహిళలు డైరెక్ట్ గా కోర్టునే  ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్ కోర్టు స్వీకరించి ఆదేశాలను జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో లక్ష మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని ఆసరా చేయుత, విద్యా దీవెన, లానేస్తం, రైతు భరోసా ,వసతి దీవెన ఇతరత్రా పథకాలకు లబ్ధి చేకూరబోతున్నట్లు తెలుస్తోంది. డిబిటి ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసేందుకు కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఈ విషయాలను సభలను ప్రసంగం చేయవద్దని హైకోర్టు మాత్రం ఆదేశాలను తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: