జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ పరిధిలో రోడ్ షో. హెచ్ నిర్వహించారు. ఈ రోడ్ షో తో పవన్ క్రేజ్ మరోసారి స్పష్టంగా బయటపెట్టింది. అధికార పార్టీ నాయకులు , అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరు అయినా రోడ్ షో నిర్వహించారు అంటే ఒక్కొక్కరికి ఎంత డబ్బు ఇవ్వాలి..? ఏమి తినిపించాలి అనే అనేక లెక్కలతో జనాలను ఆకర్షిస్తేనే రోడ్ షో లకు వచ్చేవారు.

కానీ పవన్ మాత్రం ఏమీ ఖర్చు పెట్టకుండానే జనాలు తండోపతండాలుగా విచ్చేశారు. కిలోమీటర్ల మేర పవన్ రోడ్ షో సందర్భంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇంతలా పవన్ ను చూడడానికి , అతని స్పీచ్ వినడానికి జనాలు విచ్చేశారు. దీని బట్టి స్పష్టంగా అర్థం అవుతుంది పవన్ ఒక క్రౌడ్ పిల్లర్ అని. మరి పవన్ వచ్చాడు అంటే జనాలు కేవలం పిఠాపురంలో మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా భారీ సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు. పోయినసారి ఎన్నికలలో కూడా అలాగే జరిగింది. కానీ పవన్ ని చూడడానికి వచ్చిన జనం అంతా ఓట్లు వేస్తున్నారా..? అనేది మాత్రం పెద్ద ప్రశ్నగానే మారింది. ఎందుకు అంటే పోయినసారి ఎలక్షన్లలో కూడా పవన్ ఎక్కడికి వచ్చిన కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాములు అయ్యాయి.

దానితో పవన్ కళ్యాణ్ "జనసేన" పార్టీ కనీసంలో కనీసం ఒక 20 సీట్లు అయినా తెచ్చుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ రెండు ప్లేస్ లలో పోటీ చేస్తే రెండిట్లో ఓడిపోయాడు. ఈ సారి పరిస్థితి ఏమైనా మారుతుందా..? చూడాలి. పవన్ ఎక్కడ రోడ్ షో లు నిర్వహించిన భారీగా జనాలు వస్తున్నారు. ఈ సారి పవన్ "జనసేన" పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు కూడా తక్కువే. మరి ఈ సారి పవన్ తన పార్టీ ఏ స్థాయిలో ఓటర్లను ఆకర్షిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: