( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )

సుదీర్ఘ కాలంగా పుట్టిన ఊరు, పుట్టిన ప్రాంతంలో లేదా ఇంట్లో ఉండ‌ని వారికి ఓట్లు గ‌ల్లంత‌య్యాయి. దీనికి వారు అందుబాటులో లేక‌పోవ‌డ‌మే కార‌ణం. గ‌డిచిన ఐదేళ్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు రాష్ట్ర , కేంద్ర ఎన్నిక‌ల సంఘం అదికారులు అనేక స‌ర్వేలు చేసి.. ఓట‌ర్ల జాబితాను త‌యారు చేశాయి. తుది విడ‌త జాబితాలు కూడా వ‌చ్చేశాయి. దాదాపు 18 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రికీ ఓటు హ‌క్కు క‌ల్పించారు. అయితే.. ఏదైనా కార‌ణంతో ఓటు మిస్స‌యింద‌ని భావిస్తే.. ఖంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.


ఉదాహ‌ర‌ణ‌కు రాము అనే వ్య‌క్తికి ఓటు హ‌క్కు ఉంది. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఓటేశారు. కానీ, ప్ర‌స్తుత ఓట‌ర్ల జాబితాలో ఆయ‌న పేరు క‌నిపించ‌లేదు. మ‌రి ఇప్పుడు ఏం చేయాలి. ఓటు హ‌క్కు ఉండి.. జాబితాలో పేరుంటే.. స్లిప్పులు ఇవ్వ‌క‌పోయినా.. ఓటు వేసే అవ‌కాశం ఉంది. అస‌లు జాబితాలోనే పేరు లేక‌పోతే..?  ఏం చేయాలి.. ఇక ఓటు హ‌క్కు కోల్పోవ‌డ‌మేనా? అనే సందేహాలు ముసురుకుంటాయి. కానీ, అలా వ‌దులు కోవాల్సిన అవ‌స‌రం లేద‌ని  కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది.


దీనికి ప‌రిష్కార‌మే ఫాం-17. గ‌త ఎన్నిక‌ల్లో ఎక్క‌డైతే ఓటు వేశారో.. అక్క‌డకు వెళ్లాలి. అది కూడా పోలింగ్ రోజే. మీ గుర్తింపు కార్డుల్లో ఒక‌దానిని చూపించాలి. అడ్ర‌స్ టాలీ చేసుకుని.. త‌ర్వాత‌.. మీకు ఓటు మిస్స‌యింద‌ని చెబితే.. అక్క‌డే ఉ న్న ప్రిసైడింగ్ అధికారి  మీకు ఫాం-17 ఇస్తారు. దీనిలో కొద్దిపాటి వివ‌రాలు న‌మోదు చేయాలి. ఇది రెండు నిమిషాల ప‌ని. లేదా ఐదు నిమిషాల ప‌ని. పేరు, అడ్ర‌స్‌, ఇప్పుడు ఎక్క‌డ ఉంటున్నారు. వంటివివ‌రాలు ఇస్తే చాలు.


ఆ వెంట‌నే.. దీనిని స‌రిచూసుకుని.. గ‌త ఎన్నిక‌ల్లో లిస్టును స‌రిచూసుకుంటారు. దీని ప్ర‌కారం.. వెంటనే ఓటు హ‌క్కును ఇస్తారు. అయితే.. ఇక్క‌డ థంబ్ ఇంప్రెష‌న్‌(వేలి ముద్ర‌) తీసుకుంటారు. దీనికి మీ ఆధార్ నెంబ‌రుతో స‌రిపోలుస్తారు. అంతే.. వెంట‌నే ఓటేసేందుకు అనుమ‌తి ఇస్తారు. ఇది చిన్న చిట్కా. జాబితాలో పేరులేద‌ని అమూల్య‌మైన ఓటు ను పోగొట్టుకోకుండా.. పోలింగ్ బూత్‌కు వెళ్తే.. అధికారులు కూడా సాయం చేసి మీకు హ‌క్కు క‌ల్పించేందుకు రెడీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: