భారతదేశ వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అసలు ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? లేక ఇంటికి వెళుతుందా అని అందరిలోనూ టెన్షన్ ఉంది. ఎందుకంటే బిజెపి పార్టీకి సొంతంగా... మెజారిటీ స్థానాలు దక్కలేదు. ఎన్డీఏ కూటమిలో అన్ని పార్టీలు కలిస్తేనే... కేంద్రంలో మోడీ సర్కార్ మరోసారి వస్తుంది. దీంతో ప్రాంతీయ పార్టీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది.

అయితే... జార్ఖండ్ రాష్ట్రంలో కూడా బిజెపి పార్టీకి వ్యతిరేక పవనాలు విచాయని చెప్పవచ్చు. జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి  హేమంత్ సోరేన్  జైలుకు వెళ్లిన తర్వాత... ఆయన బాధ్యతలను... అతని భార్య కల్పనా సోరెన్ తీసుకున్నారు. గాండేయి అసెంబ్లీకి జరిగిన... బై ఎలక్షన్ లో కల్పన తాజాగా పోటీ చేశారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో... మాజీ ముఖ్యమంత్రి హేమంత్  సతీమణి కల్పన గ్రాండ్ విక్టరీ కొట్టారు.

 ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి దిలీప్ కుమార్ పై... కల్పన విజయం సాధించడం జరిగింది. దిలీప్ కుమార్ పై ఏకంగా 1148 ఓట్ల స్వల్ప మెజారిటీతో.... కల్పన విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో కల్పనకు... 16,203  ఓట్లు పోలయ్యాయి. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థికి 15,055 ఓట్లు వచ్చాయి.  ఈ ఎన్నికల్లో నోటాకు 700 వచ్చాయి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బిజెపి అభ్యర్థి దిలీప్ కుమార్ పై... జే ఎం ఎం  నేత కల్పన విజయం సాధించారు.

 ఇది ఇలా ఉండగా జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్..గాండేయి అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశాడు. ఈ తరుణంలోనే అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇది ఇలా ఉండగా జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 14 లోక్సభ స్థానాలు  ఉన్న సంగతి తెలిసిందే.  బిజెపి పార్టీ 8 స్థానాలలో లీడింగ్ లో ఉంది. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీ ఏకంగా 11 సీట్లను గెలుచుకుంది. కానీ ఈసారి ఆ సీట్లు దక్కేలా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: