ఎల్లుండే ఏపీ, తెలంగాణలో పోలింగ్.. ఎన్నికల సమయంలో ఏ పార్టీకి ఓటేయాలి.. ఏ నేతకు ఓటేయాలి అనే అంశంపై ఇప్పటికే మీరు ఓ అభిప్రాయానికి వచ్చి ఉంటారు. అంత వరకూ మంచిదే.. కానీ.. అసలు మీరు ఓటు వేయాడానికి మీ ఓటు అంటూ ఉండాలి కదా. మరి మీ ఓటు ఉందా.. లేదా.. అదేంటి.. నేను మొన్నటి ఎన్నికల్లోనూ ఓటేశాను కదా.. నా ఓటు లేకపోవడం ఏంటి అనుకుంటున్నారా.. మీ ఓటు కచ్చితంగా ఉందని మీరు నమ్ముతున్నారా..అలా అయితే కొంచం కష్టమే.


ఎందుకంటే.. ఓటర్ల జాబితాను తరచూ సంస్కరిస్తుంటారు. ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటారు. అందులో భాగంగా మీ ఓటు ఉండొచ్చు.. ఎగిరిపోవచ్చు. మీ ఓటుపై ఎవరైనా ఫిర్యాదు చేసినా ఆ ఓటు తొలగించొచ్చు. లేదా.. ఇతరత్రా అనేక కారణాలతో మీ ఓటు జాబితాలో లేకుండా పోవచ్చు. గతంలో ఓటేశాం కదా.. అని ఓటరు ఐడీనో, ఆధార్‌ కార్డో పట్టుకుని ఓటు వేయడానికి వెళితే.. జాబితాలో మీరు ఓటు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.


అందుకే మీ ఓటు ఉందో లేదో ముందే చెక్‌ చేసుకోండి. ఎలక్టోరల్ రోల్‌ను తనిఖీ చేసుకోండి. మరి ఎలా తనిఖీ చేయాలంటారా.. ఇదిగో ఇలా చేయండి..కింది పద్ధతుల్లో దేనినైనా మీరు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. అందులో ఒకటి ఆన్‌లైన్ విధానం. మీరు నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ (NVSP) వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఓటు చెక్‌ చేసుకోవచ్చు. ఆ వెబ్‌ సైట్లో ఎలక్టోరల్ సెర్చ్  విభాగంలో మీ పేరు, వయస్సు, రాష్ట్రం, జిల్లా మరియు అసెంబ్లీ నియోజకవర్గం వంటి అవసరమైన వివరాలను పూర్తి చేసి చెక్‌ చేసుకోవచ్చు.


మీరు ఓటర్ల జాబితాలో ఉన్నట్లయితే, మీ ఓటరు ID నంబర్‌తో పాటు మీ వివరాలను వెబ్‌సైట్ వెల్లడిస్తుంది. అలాకాకుంటే మీరు 1950లో ఓటరు హెల్ప్‌లైన్‌కు కాల్ చేయవచ్చు. ఎన్నికల జాబితాలో మీ పేరును తనిఖీ చేయడానికి మీరు ఎక్కడికి వెళ్లాలో ఆ కార్యాలయ వివరాల కోసం అభ్యర్థించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: