వజ్రాయుధం కన్నా గొప్పది ఓటు. అలాంటి ఓటును అమ్ముకోవడం మనం చేస్తున్న పెద్ద తప్పు. కానీ రాజకీయ పార్టీలు  ప్రజలను విపరీతంగా మభ్యపెట్టి  గిఫ్టులు, డబ్బులు, ఇలా అనేక రకాలుగా  లోబర్చుకొని ఓట్లు కొంటున్నారు. ఈ విధంగా వారు పోలింగ్ సమయంలో ఎంత ఖర్చు పెట్టారో గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు మనపై 100 రేట్లు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈ విషయం తెలిసినా కానీ ప్రజలు, ఏమాత్రం  వెనక్కి తగ్గకుండా ప్రతి పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. అంతే కాదండోయ్ డబ్బులు రాకపోతే రోడ్డుమీదకి ఎక్కి మరి నాకు డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చారు అని గోల గోల చేస్తున్నారు. అలా ప్రజలు డబ్బులు రాక పార్టీల నాయకులను తిట్టిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం  ఏపీలో ప్రచార పర్వం చివరి దశకు చేరుకుంది. మిగిలింది డబ్బుల పర్వమే. 

ఇప్పటికీ అన్ని పార్టీల నాయకులు  స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని  గ్రామాల వారీగా డివైడ్ అయ్యారట. చిన్న గ్రామాలకు అయితే తక్కువ మంది పెద్దపెద్ద గ్రామాలకైతే మూడు, నాలుగు టీంలు ఏర్పాటు చేశారట. ఒక్క టీంలో ముగ్గురు చొప్పున ఉంటూ  డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా ఒక గ్రామానికి చెందిన పార్టీ నాయకుడు మరో వ్యక్తి డబ్బులు తీసుకువచ్చేవారు, ఇంకో వ్యక్తి డబ్బులు ఇస్తూ ఓటర్ లిస్ట్ లో చెక్ చేసుకునేవారు. ఇలా పకడ్బందీగా డబ్బులు పంచుతూ  ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ టీం డబ్బులు పంచిన తర్వాత  వీరందరి పైన ఉండేటువంటి ఒక లీడర్ అందరికీ డబ్బులు వచ్చాయా లేదా అని చెక్ చేస్తూ వస్తుంటాడు. అలాంటి ఈ తరుణంలో డబ్బులు అందని వారు కూడా  ఉంటున్నారట.

ఆ సమయంలో డబ్బులు అందకపోతే ఏం చేయాలి ఎవరిని కలవారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే గ్రామాల్లో డబ్బులు పంచిన సమయంలో డబ్బులు అందని వారు టెన్షన్ పడవద్దు  పార్టీల నాయకులు అంటున్నారు. వారి యొక్క ఓటర్ స్లిప్ పట్టుకొని  గ్రామంలో ఉన్నటువంటి, ఆయా పార్టీలకు చెందినటువంటి స్థానిక నాయకున్ని కలవాలట. వారు వారి దగ్గర ఉన్న లిస్టులో చూసుకొని  డబ్బులు రాని వారికి అమౌంట్ అందజేస్తున్నారట. ఈ విధంగా ప్రతి గ్రామానికి ఒక స్పెషల్ కౌంటర్ సీక్రెట్ గా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ప్రతి పార్టీ  డబ్బుల రూపంలో ఓటర్లను కొంటూ  ప్రలోభాలకు గురిచేస్తున్న కానీ  ఎలక్షన్ కమిషన్ అంటి ముట్టనట్టు ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: