- తాను విద్య నేర్పిన నాయకులు తన ని విమర్శిస్తుంటే నలిగిపోయాడు..
- సైలెంట్ గా ఉండి సింహం లాగా దెబ్బ కొట్టాడు..
చంద్రబాబు రాజకీయ అనుభవం ఉన్నంత ఏజ్ ఉండదు జగన్ కు . అయినా ఆయన్ని ఢీ కొట్టారు. ఒక్కసారి చంద్రబాబు పై గెలవగానే ప్రపంచాన్ని గెలిచాడు అనుకున్నాడో ఏమో, అదే ఊహల్లో బతికేశాడు. కింది స్థాయిలో ఏం జరుగుతుందనేది ఆలోచించలేదు. చివరికి చతికిలపడి ఓడిపోయాడు. చంద్రబాబు ఇలాంటి ఓటములు ఎన్నో చూశాడు. ఇంతకంటే క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. జగన్ నాన్న వైయస్సార్ తోనే పోరాడిన ధీరుడు చంద్రబాబు. అలాంటిది జగన్ ఎంత.. ఆయన ఎత్తులకు పై ఎత్తులు వేసే తెలివి ఉన్నా కానీ ఏనాడు విర్రవీగలేదు. తన పని ఏంటో తాను చేసుకుంటూ వెళ్ళాడు చివరికి జగన్ కు కర్ర కాల్చి వాత పెట్టినంత పని చేశాడు. టిడిపి చరిత్రలోనే ఏనాడు లేనివిధంగా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు చంద్రబాబు నాయుడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి